Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video

Pawan Kalyan Rally: మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరయ్యేందుకు పవన్ కల్యాణ్ వెళ్లే ర్యాలీలో అపశ్రుతి జరిగింది. అత్యుత్సాహంతో ఓ అభిమాని పవన్ కారు పైకి ఎక్కి ఆయన్ని కౌగిలించుకోబోయాడు. అప్పుడు అతడ్ని గమనించిన బాడీగార్డులు వెనక్కి లాగారు. ఈ క్రమంలో పవన్ కింద పడిపోయారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 07:18 AM IST
    • మత్య్సకార అభ్యున్నతి ర్యాలీలో అపశ్రుతి
    • పవన్ కల్యాణ్ ను హత్తుకోబోయిన అభిమాని
    • తోపులాటలో కారుపై పడిపోయిన జనసేనాని
Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video

Pawan Kalyan Rally: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నేడు జరగనున్న మత్స్యకార అభ్యున్నతి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి నర్సాపురంకు ర్యాలీగా బయలుదేరారు. విమానాశ్రయంలో జనసేన పార్టీ కార్యక్రర్తలు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

రోడ్డు మార్గంలో రావులపాలెం, సిద్ధాంతం, పాలకొల్లు మీదుగా ర్యాలీగా పవన్ కల్యాణ్ నర్సాపురం చేరుకోనున్నారు. అయితే ఈ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో పవన్ తన కారుపై నిల్చొని ప్రజలకు అభివాదం చేయబోయారు. ఆ క్రమంలో ఓ అభిమాని తన అత్యుత్సాహంతో పవన్ ను ఇబ్బంది పెట్టాడు. 

కారు నిల్చొని ఉన్న పవన్ కల్యాణ్ ను హత్తుకునేందుకు అభిమాని వెళ్లగా.. అంతలో అతడ్ని గమనించిన బాడీగార్డులు ఆ వ్యక్తిని వెనక్కి లాగారు. ఈ తోపులాటలో కారు నిల్చున్న పవన్ కల్యాణ్ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే ఈ ఘటనలో పవన్ కల్యాణ్ కు గాయలేవి కాకపోవడం వల్ల ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.  

Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు!

Also Read: Govindananda Saraswati: 'TTD దైవ‌ద్రోహం చేస్తోంది'.. గోవిందానంద సరస్వతి షాకింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News