Ind Vs Eng: లార్డ్స్‌ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది.  ఇంగ్లండ్‌ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్‌ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే కుప్పకూలిపోయారు.  ముఖ్యంగా గత మ్యాచ్‌ అనుభవం తాలూకు కసినంతా ప్రదర్శిస్తూ అండర్సన్‌ టీమిండియా ను దెబ్బకొట్టాడు. అనంతరం వికెట్‌ కోల్పోకుండా మన స్కోరును దాటేసిన ఇంగ్లండ్‌ తొలి రోజును ఘనంగా ముగించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం ఆరంభమైన మూడో టెస్టు(Ind Vs Eng 3rd Test) తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్(England) బౌలర్ల ధాటికి టీమ్‌ఇండియా(Team india) 78 పరుగులకే కుప్పకూలింది. 105 బంతులాడి 19 పరుగులు చేసిన రోహితే(Rohit Shrma) టాప్‌స్కోరర్‌. అతనితో పాటు రహానె (18) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రాలే (16) అత్యధికం కావడం గమనార్హం. అండర్సన్‌(Anderson) (3/6), ఒవర్టన్‌ (3/14) చెరో మూడు వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ ఆట ముగిసే సమయానికి 120/0తో నిలిచింది. ఓపెనర్లు బర్న్స్‌ (52 బ్యాటింగ్‌), హమీద్‌ (60 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత బౌలర్లు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయారు.


Also Read: Afghanistan Cricket Board: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల తొలి నియామకం, ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లి


తొలి రోజు భారత్‌(India)బ్యాటింగ్‌ను చూస్తే... లార్డ్స్‌లో గెలిచిన జట్టు ఇదేనా అన్న అనుమానం కలగక మానదు. అంత నిర్లక్ష్యం టీమిండియా ఆటతీరులో కనిపించింది. మూడో టెస్టులో టాస్‌(Toss) గెలిచి బ్యాటింగ్‌కు దిగింది భారత్. పాతిక పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్...30ఓవర్లు కూడా పూర్తవకుండానే సగం వికెట్లు చేజార్చుకుంది. ఐదు ఓవర్లు వ్యవధిలోనే మిగతా ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఇదీ భారత్ తొలి ఇన్నింగ్స్ కొనసాగిన తీరు. ఓ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ కూడా కనీసం 20 పరుగులు చేయకపోవడం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్‌(England)లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. దీని కంటే ముందు 42 (1974లో లార్డ్స్‌లో), 58 (1952లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో) పరుగుల ఇన్నింగ్స్‌లున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook