Afghanistan Cricket Board: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల తొలి నియామకం, ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లి

Afghanistan Cricket  Board: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు దేశంలో మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు పట్టం కట్టారు. ముందుగా క్రికెట్‌పై‌నే దృష్టి సారించడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2021, 06:46 PM IST
Afghanistan Cricket Board: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల తొలి నియామకం, ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లి

Afghanistan Cricket  Board: ఆఫ్ఘనిస్తాన్‌ను వశపర్చుకున్న తాలిబన్లు దేశంలో మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు పట్టం కట్టారు. ముందుగా క్రికెట్‌పై‌నే దృష్టి సారించడం విశేషం.

ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan) కొత్త తాలిబన్ రాజ్యం స్థాపిస్తామంటున్న తాలిబన్లు ఆ దిశగా సంకేతాలిస్తున్నారు. దేశంలో తొలి అధికారిక నియామకాన్ని క్రికెట్‌తోనే ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల క్రితం ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక జరిగిన తొలి నియామకం ఇదే. ఫజ్లి 2018-19లో ఏసీబీ ఛీఫ్‌గా వ్యవహరించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘన్ జట్టు ఓటమి కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. ఇప్పుడు తిరిగి అతడి హయాంలో ఆఫ్ఘన్ క్రికెట్ రాణిస్తుందని తాలిబన్లు(Talibans) ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే వచ్చే నెలలో పాకిస్తాన్ (Pakistan)జట్టుతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు(Afghan cricket Board) ప్రకటించింది. ఓ వైపు క్రికెట్‌కు మద్దతిస్తామని చెబుతూనే మరోవైపు ఏ కారణాలు వెల్లడించకుండా సిరీస్ వాయిదా వేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. శ్రీలంకలో జరగాల్సిన ఈ సిరీస్‌ను పాకిస్తాన్‌కు మార్చారు. కరోనా సంక్రమణ పెరగడంతో శ్రీలంకలో పదిరోజుల లాక్‌డౌన్ విధించడం, కాబూల్ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు రాకపోకలు లేకపోవడంతో శ్రీలంక నుంచి పాకిస్తాన్‌కు వేదిక మారింది.

Also read: Tokyo Paralympics 2020: నేటి నుంచే టోక్యోలో పారాలింపిక్స్‌..రెండంకెల పతకాలే లక్ష్యంగా భారత్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News