India World Cup 2023 Squad: సస్పెన్స్ వీడింది.. ప్రపంచ కప్‌కు భారత జట్టు ప్రకటన
World Cup 2023 India Squad Announced: వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు సిద్ధమైంది. 15 మంది ఆటగాళ్లకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్‌కు చోటు దక్కగా.. సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు ఇలా..
World Cup 2023 India Squad Announced: ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన టీమ్‌నే ఫైనలైజ్ చేశారు. అందరూ ఊహించినట్లే సంజూ శాంసన్‌కు నిరాశ ఎదురైంది. ఆసియాకప్‌కు ఎంపికైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, గాయం తరువాత రీఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ద్ కృష్టలను బీసీసీఐ పక్కనబెట్టింది. యుజ్వేంద్ర చాహల్‌కు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు. నలుగురు ఆల్‌రౌండర్లు, ముగ్గురు పేసర్లకు జట్టులో స్థానం కల్పించారు.
ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్.
ప్రస్తుతం ప్రపంచకప్ జట్టును ప్రకటించినా.. సెప్టెంబర్ 28వ తేదీ వరకు మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న బీసీసీఐ 15 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను ఐసీసీకి సమర్పించనుంది. టీమ్‌ను ప్రకటించిన అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌పై కసరత్తు చేశాడని.. రాహుల్ ప్రపంచకప్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని వెల్లడించారు.
వరల్డ్ కప్ టీమిండియా కాంబినేషన్ బాగానే కనిపిస్తోంది. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లకు చోటు దక్కింది. టాప్ ఆర్డర్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్లుగా హార్థిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, సిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ పంచుకోనున్నారు.
ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకోని ఆటగాళ్ల బాధ తనకు అర్థమవుతోందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఇలాంటి పరిస్థితినే హిట్‌మ్యాన్ గతంలో ఎదుర్కొన్నాడు. 2011 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు భారత జట్టులో చోటు దక్కలేదు. ఆఖరి క్షణంలో రోహిత్ ప్లేస్‌లో పీయూష్ చావ్లా చోటు దక్కించుకున్నాడు.
Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు
Also Read: RBI UPI Payments: యూపీఐ యూజర్లకు ఆర్‌బీఐ మరో గుడ్‌న్యూస్.. ఇది కదా అసలు కిక్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook