India vs Australia Test Series: టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పాసయ్యాడు. అదేనండీ.. ఐపీఎల్ 2020 సమయంలో గాయపడ్డ రోహిత్ శర్మ నేడు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చాడు. బెంగళూరులోని జాతీయ క్రికెడ్ అకాడమీ (NCA)లో ఫిజియోలు ఓపెనర్ రోహిత్ శర్మకు ఫిట్‌నెస్ సంబంధిత టెస్టులు నిర్వహించగా టెస్ట్ పాసయ్యాడు. బీసీసీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Indian Cricketers fined: టీమిండియాకు మరోసారి జరిమానా విధించిన ఐసీసీ



ఐపీఎల్ సమయంలో గాయపడ్డ రోహిత్ శర్మ (Rohit Sharma) కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండటం తెలిసిందే. ఆ తర్వాత చివరి కీలక మ్యాచ్‌లలో బరిలోకి దిగడం.. ఫైనల్లో రాణించి భారీ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు ఐపీఎల్ 2020 (IPL 2020) టైటిల్ అందించాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. కానీ ఐపీఎల్ మధ్యలోనే ఆసీస్ పర్యటనకు జట్టును ప్రకటించారు. ప్రకటించిన మరుసటిరోజే రోహిత్ బ్యాటింగ్ చేయడంతో వివాదం మొదలైంది.


Also Read: WhatsApp Features: మీ వాట్సాప్‌లో మెస్సెజ్‌లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!



రోహిత్ శర్మ ఫిట్‌నెస్ గురించి సరైన అవగాహనా లేకుండా, రోహిత్‌తో చర్చించకుండానే ఆసీస్ టూర్ నుంచి హిట్ మ్యాన్‌ను తప్పించారు. తీవ్ర విమర్శలు రావడంతో టెస్ట్ సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది. డిసెంబర్ 17 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే క్వారంటైన్ రూల్స్ కారణంగా ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లినా తొలి టెస్టులు మాత్రం రోహిత్‌కు ఛాన్స్ ఉండదు. ఆ తర్వాతి టెస్టులలో ఆడే అవకాశం ఉంది. వన్డే సిరీస్ ఆసీస్ 2-1తో నెగ్గగా, టీ20 సిరీస్ 2-1తో భారత్ సాధించింది.


Also Read: Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook