Ind vs Eng 2nd Test Live Updates: భారీ విజయంతో ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న Team India
India vs England 2nd Test Live Updates: ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
India vs England 2nd Test Live Updates: ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది.
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో 200 పైచిలకు పైగా పరుగులతో ఓటమిపాలైన టీమిండియా(Team India) రెండో టెస్టులో ఏకంగా 317 పరుగుల తేడాతో విజయదుందుబి మోగించింది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో రాణించిన కోహ్లీ సేన రెండో టెస్టులో విజయంతో టెస్టు సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.
Also Read: Ravichandran Ashwin: 33 ఏళ్ల తర్వాత తొలి క్రికెటర్‌గా అశ్విన్ అరుదైన రికార్డు, Englandపై పరుగుల మోత
రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో సమష్టిగా రాణించారు. ఇంగ్లాండ్(England) ఇన్నింగ్స్‌లో 10 వికెట్‌కు స్టువర్ట్ బ్రాడ్(5 నాటౌట్), మోయిన్ అలీ(43; 18 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) నెలకొల్పిన 38 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.
Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain
కాగా, ఓపెనర్ రోహిత్ శర్మ(161; 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ శతకం(106; 148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్)తో ఆకట్టుకున్నాడు. ఈ టెస్టులో భాగంగా 200 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా టీమిండియా(Team India) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ - 329 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 134 ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్ - 286 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ - 164 ఆలౌట్
Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook