Ben Cutting Wedding Photos: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా‌ను వివాహం చేసుకున్న Australia క్రికెటర్ బెన్ కటింగ్

Ben Cutting Marries Former Miss World Australia Erin Holland: ఎట్టకేలకు మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ వివాహం చేసుకున్నాడు. భార్య ఎరిన్ హాలాండ్‌కు ముద్దు ఇస్తున్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 15, 2021, 12:58 PM IST
  • ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కటింగ్ ఓ ఇంటివాడయ్యాడు
  • మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌ను వివాహం చేసుకున్న బెన్ కటింగ్
  • కరోనా కారణంగా ఏడాది నుంచి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న జంట
Ben Cutting Wedding Photos: మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా‌ను వివాహం చేసుకున్న Australia క్రికెటర్ బెన్ కటింగ్

Ben Cutting Wife Marries Erin Holland: ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ కటింగ్ ఓ ఇంటివాడయ్యాడు. మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్, టీవీ వ్యాఖ్యాత ఎరినా హాలాండ్‌ను వివాహం చేసుకున్నాడు ఆల్ రౌండర్ క్రికెట్ బెన్ కటింగ్. కరోనా వైరస్ కారణంగా గతేడాది తన వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జోడీ తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించిన బెన్ కటింగ్ ఆల్‌రౌండర్‌గా అటు బ్యాటు, ఇటు బంతితోనూ సేవలు అందించాడు. న్యూసౌత్‌వేల్స్‌లోని బైరాన్ బేలో ఇరు కుటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితులు స్నేహితులు సమక్షంలో బెన్ కటింగ్, మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ఎరిన్ హాలాండ్‌ వివాహం ఘనంగా జరిగింది. 

Also Read: Virat Kohli కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన England మాజీ క్రికెటర్

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by D O N N Y G A L E L L A (@donnygalella)

వాస్తవానికి కొన్నేళ్ల కిందట ఈ Australian Cricketer బెన్ కటింగ్, ఎరిన్ హాలాండ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గతేడాది వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సమస్య తలెత్తడంతో ఏడాదిపాటు తమ వివాహాన్ని వాయిదా వేసుకోవడం తెలసిందే. తాజాగా బైరాన్ బే వేదికగా వివాహం చేసుకున్నారు.

Also Read: Rahul tewatia got engaged: రాహుల్ తేవతియా నిశ్చితార్ధం అయిపోయింది..ఎవరితోనో తెలుసా

ఆస్ట్రేలియా జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా సేవలు అందించాడు. వన్డేలు, టీ20లలో ఆసీస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లోనూ ఆల్ రౌండర్‌గా విలువైన ఆటగాడిగా సేవలు అందించాడు. చివరగా  బిగ్‌బాష్ లీగ్ 2020-21లో సిడ్నీ థండర్స్ తరఫున మైదానంలో కనిపించాడు. తాజాగా పెళ్లి వార్తను ప్రకటించాడు. భార్యకు బెన్ కటింగ్ ముద్దు ఇస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News