Ravichandran Ashwin Unique Records: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. అటు బంతితో రాణించి అశ్విన్, ఆపై బ్యాటుతోనూ అద్భుతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించాడు. అశ్విన్ శతకం(106; 148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్)తో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 85.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.
శతకం సాధించే క్రమంలో టీమిండియా క్రికెటర్ అశ్విన్ అరుదైన రికార్డులు నమోదు చేశాడు.
టెస్టుల్లో అశ్విన్ 5 వికెట్లు సాధించడంతో పాటు శతకాలు సాధించడం ఇది మూడోసారి.
టెస్టుల్లో 200 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా టీమిండియా(Team India) స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌తో కలిపి మొత్తం 391 వికెట్లు సాధించాడు.
స్వదేశంలో అత్యధిక పర్యాయాలు 5 వికెట్ల ఇన్నింగ్స్ ఫీట్ నమోదు చేసిన నాలుగో బౌలర్ అశ్విన్. మురళీధరన్(45), హెరాత్(26), అనిల్ కుంబ్లే(25) ఉన్నారు.
A moment to cherish forever! @ashwinravi99 gets his Test💯 in Chennai and Md. Siraj erupts in joy. The dressing room stands up to applaud.🙌🏾 #TeamIndia #INDvENG @paytm pic.twitter.com/ykrBhsiTbl
— BCCI (@BCCI) February 15, 2021
టెస్టుల్లో భారత్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్ అశ్విన్. కుంబ్లే 350 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
తాజాగా ఇంగ్లాండ్ మీద చేసిన శతకం అశ్విన్(Ravichandran Ashwin) టెస్టు కెరీర్‌లో అయిదవది. కాగా, వెస్టిండీస్ తర్వాత అశ్విన్ శతకం సాధించిన జట్టు ఇంగ్లాండ్.
Also Read: Virat Kohli కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన England మాజీ క్రికెటర్
చెపాక్ స్టేడియంలో శతకం సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా అశ్విన్ నిలిచాడు. 1986/87 సీజన్‌లో క్రిష్ణమాచారి శ్రీకాంత్ 123 పరుగుల తర్వాత 33 ఏళ్లకు శతకం సాధించిన రెండో తమిళనాడు క్రికెటర్ అశ్విన్.
చెన్నైలో ఏడో వికెట్‌కు నెలకొల్పిన 96 పరుగుల భాగస్వామ్యం నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యం. కోహ్లీతో కలిసి అశ్విన్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook