IND vs NZ: కివీస్ తో ఆఖరి టీ20 నేడే.. ఉమ్రాన్, సంజూలకు ఛాన్స్ ఇస్తారా?
IND vs NZ: ఇవాళ ఆఖరి టీ20 పోరుకు సిద్ధమైంది టీమిండియా, న్యూజిలాండ్ జట్లు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
India vs New Zealand, 3rd T20I: కివీస్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు రెడీ అయింది. మంగళవారం నేపియర్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఇక రెండో టీ20 భారత్ అద్భుత విజయం సాధించింది. ఇక చివరి మ్యాచ్ అయినా మూడో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని హార్ధిక్ సేన భావిస్తోంది. గత మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవాలనే కృతనిశ్చయంతో న్యూజిలాండ్ ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం కానుంది.
గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభమన్ గిల్, సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఓపెనర్ ఇషాన్ కిసాన్ పర్వాలేదనిపించినా... మరో ఓపెనర్ రిషభ్ పంత్ విఫలమవ్వడం భారత్ ను ఆందోళకు గురి చేసే అంశం. సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. అతని విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో గత మ్యాచ్ చూస్తే చాలు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు యజమాన్యం కోరుకుంటోంది. గత మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు రాణించడం సానుకూలాంశం.
ఇక కివీస్ విషయానికొస్తే... కెప్టెన్ విలియమ్సన్ అఖరి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. జట్టుకు సీనియర్ పేసర్ టీమ్ సౌథీ సారథిగా వ్యవహారించనున్నారు. విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్ మన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సూర్యను కట్టడి చేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు కివీస్ బౌలర్లు. మరి ఈరోజు మ్యాచ్ గెలిచి టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.
Also Read: Suryakumar Yadav Cars Collection: క్రికెట్ మాత్రమే కాదు.. సూర్యకుమార్ యాదవ్‌కు అవంటే చాలా ఇష్టమట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook