India vs South Africa 2nd Test Day 2: జోహెన్నెస్​బర్గ్​ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు (IND vs SA 2nd Test, Day 2) ఆట ముగిసే సమయానికి టీమ్​ఇండియా 58 పరుగుల అధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్​ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్​.. 85 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) (35), అజింక్య రహానే(11) (Ajinkya Rahane) ఉన్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్​ను 8 పరుగులు, మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా.. శార్దూల్‌ ఠాకూర్‌ (7/61) ధాటికి 229 పరుగులకు కుప్పకూలింది. పీటర్సన్‌ (62; 118 బంతుల్లో 9×4), తెంబా బవుమా (51; 60 బంతుల్లో 6×4, 1×6) రాణించటంతో.. 27 పరుగుల స్పల్ప ఆధిక్యం సాధించింది అతిథ్య జట్టు. రెండో రోజు భారత పేసర్లను దక్షిణాఫ్రికా (South Africa) గట్టిగానే ప్రతిఘటించింది. అంత తేలిగ్గా వికెట్లు ఇవ్వలేదు. ఉదయం సెషన్లో బుమ్రా, షమి ఎంతో శ్రమించినా ఫలితం ఫలితం లేకపోయింది. ఓ దశలో ఆతిథ్య  జట్టు 88/1తో బలమైన స్థితిలో నిలిచింది. తర్వాత శార్దూల్ రంగప్రవేశం చేయటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శార్దూల్‌ (Shardul Thakur) ధాటికి 14 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 88/1 నుంచి 102/4కు చేరుకుంది. 


Also read: IND Vs SA 2nd Test: తొలిరోజు చేతులెత్తేసిన ఇండియన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా స్కోరు 35/1


అనంతరం బవుమా, వెరినె (21; 72 బంతుల్లో 2×4) పోరాటంతో మళ్లీ ఆ జట్టు పోటీలోకి వచ్చింది. ఈ ఇద్దరు అయిదో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా  162/4తో మంచి ఆధిక్యంపై కన్నేసింది. కానీ మరోసారి శార్దూల్ ప్రోటీస్ ను దెబ్బతీశాడు. వీరిద్దరినీ స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడంతో..తిరిగి భారత్ (Team india) పోటీలోకి వచ్చింది.  టెయిలెండర్లు రాణించటంతో.. అతిథ్య జట్టు 229 పరుగులకు ఆలౌట్ అయింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి