IND Vs SA 2nd Test: తొలిరోజు చేతులెత్తేసిన ఇండియన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా స్కోరు 35/1

IND Vs SA 2nd Test: టీమ్ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ 202 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా 35/1 స్కోరుతో నిలిచింది. సఫారీ జట్టు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 11:37 PM IST
IND Vs SA 2nd Test: తొలిరోజు చేతులెత్తేసిన ఇండియన్ బ్యాటర్లు.. దక్షిణాఫ్రికా స్కోరు 35/1

IND Vs SA 2nd Test: దక్షిణాఫ్రికాలోని వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య జట్టు 35/1 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే సఫారీలకు షాక్‌ తగిలింది. 

మహమ్మద్ షమీ వేసిన నాలుగో ఓవర్లో ఓపెనర్‌ మార్కరమ్ (7) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కీగన్ పీటర్సన్‌ (14)తో కలిసి డీన్‌ ఎల్గర్‌ (11) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. 

భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ ఒక వికెట్‌ పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు భారత బౌలర్లు చెలరేగి.. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

అంతకు ముందు, టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 63.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (50) అర్ధ శతకంతో రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (46) అర్ధ శతకం చేజారినా.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగిలిన బ్యాటర్లు వెంటనే పెవీలియన్ చేరారు. 

వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్‌ పుజారా (3), అజింక్య రహానె (0) మరోసారి చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్‌ నాలుగు, ఒలివర్‌ మూడు, కగిసో రబాడ మూడు వికెట్లు పడగొట్టారు. 

Also Read: Jayasuriya Ex Girlfriend: భార్య సెక్స్ టేప్ లీక్ చేసిన మాజీ క్రికెటర్.. ప్రతీకారం తీర్చుకునేందుకే!

Also Read: Rahul Dravid on Kohli: కెప్టెన్ విరాట్ కోహ్లీపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు.. అతడొక అద్భుతమని కితాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News