India vs South Africa : రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
India vs South Africa 3rd Test Day 3 Highlights : దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆతిథ్య జట్టువైపే విజయం సాధించే అవకాశాలు.
India vs South Africa 3rd Test Day 3, Highlights SA reach 101/2 at Stumps : కేప్‌టౌన్ వేదికగా (Cape Town) దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో (India vs South Africa 3rd Test) ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు.. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు శ్రమిస్తున్నారు. మొత్తానికి చివరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 23 పరుగుల వద్ద ఓపెనర్ మార్కరమ్ (16) ను (Aiden Markram) షమీ (Shami) పెవిలియన్ పంపాడు. అయితే తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పీటర్సన్.. (Petersen) కెప్టెన్ ఎల్గర్ (Dean Elgar) అండగా దూకుడుగా ఆడాడు. వారిద్దరూ క్రీజులో పాతుకుపోయారు.
భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో.. ప్రస్తుతం సౌతాఫ్రికా (South Africa) రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి విజయానికి 111 పరుగుల దూరంలో ఉంది. ఇక దక్షిణాఫ్రికా జట్టుకు చేతిలో పుష్కలంగా వికెట్లు ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. ఆ జట్టు విజయాన్ని అడ్డుకోవడం కష్టమే అనిపిస్తోంది.
దక్షిణాఫ్రికా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి...పీటర్సన్ (48 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. టీమిండియా బౌలర్స్ ఎంత శ్రమించినా పీటర్సన్.. (Petersen) ఎల్గర్ (30) జోడీ వికెట్ ఇవ్వకుండా చాలా సేపు అడ్డుపడ్డారు. అయితే చివరకు బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లో ఎల్గర్ (30) వికెట్ పడింది. టీమిండియా బౌలర్లు షమీ, బుమ్రా తలో వికెట్ తీశారు.
ఇక దక్షిణాఫ్రికా జట్టు విజయానికి 111 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియా ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. ఇక రేపు ఫస్ట్ సెషన్‌లో వికెట్లను తీసే దాన్ని బట్టి విజయం ఖరారుకానుంది. అయితే టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని టీమిండియా 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది.
Also Read : IND vs SA: టీమ్‌ఇండియా 198 పరుగులకు ఆలౌట్.. ప్రోటీస్ ముందు స్వల్ప లక్ష్యం!
అయితే టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన మొట్టమొదటి భారత, ఆసియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2010లో ధోని చేసిన 90 పరుగులే ఇక్కడ అత్యధికం కాగా రిషబ్ పంత్ దాన్ని అధిగమించాడు. ఇక కేఎల్ రాహుల్ (10), కోహ్లి (29), పంత్ మినహా ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జన్సెన్ 4, రబాడ, ఎంగిడి చెరో 3 వికెట్లు తీశారు. ఇక అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు.. దక్షిణాఫ్రికా (South Africa) తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Also Read : PM Modi Meet With CMs: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం- కొవిడ్ పరిస్థితులపై చర్చ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook