PM Modi Meet With CMs: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం- కొవిడ్ పరిస్థితులపై చర్చ!

ముఖ్యమంత్రులతో పీఎం మోదీ భేటీ రాష్ట్రాల వారీగా కరోనా పరిస్థితులపై ఆరా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్​ షా

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 07:26 PM IST
  • ముఖ్యమంత్రులతో పీఎం మోదీ భేటీ
  • రాష్ట్రాల వారీగా కరోనా పరిస్థితులపై ఆరా
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు
  • సమావేశంలో పాల్గొన్న హోం మంత్రి అమిత్​ షా
PM Modi Meet With CMs: సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం- కొవిడ్ పరిస్థితులపై చర్చ!

PM Modi Meet With CMs: దేశంలో కరోనా వైరస్​ కల్లోలం కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా కూడా (Amit Shah in PM meeting with CMs) పాల్గొన్నారు.

ప్రస్తుత పరిస్థితులపై సీఎంలతో చర్చలు జరుపుతున్నారు ప్రధాని. కొవిడ్ కట్టడికి రాష్ట్రాలు అమలు చేస్తున్న ముందు జాగ్రత్త చర్యల గురించి అడిగి (Modi on corona measures in states) తెలుసుకుంటున్నారు. దీనితో పాటు కొవిడ్ కట్టడికోసం దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో మరోసారి లాక్​డౌన్​ పెట్టే అంశంపై కూడా చర్చ జరగొచ్చని తెలుస్తోంది.

వ్యాక్సినేషన్ గురించి సీఎంలతో ప్రస్తావించిన ప్రధాని మోదీ.. దేశంలో టీకా కార్యక్రమానికి ఏడాది కావొస్తుందని (One year to Corona vaccination in India) తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 70 శాతం వ్యాక్సినేషన్ (రెండు డోసులు)​ పూర్తయిందని తెలిపారు (Vaccination in India) ప్రధాని. ప్రతికూల పరిస్థితుల్లోనూ టీకా ప్రక్రియ కొనసాగుతున్నట్లు వివరించారు.

ఇక జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ (Corona vaccine for Children) ప్రారంభించగా.. ఇప్పటి వరకు 3 కోట్ల మందికి మొదటి డోసు ఇచ్చినట్లు వెల్లడించారు ప్రధాని. మరోవైపు ఈ నెల 10 నుంచి అర్హులకు ప్రికాషన్​ డోసు టీకా కూడా ఇస్తున్న విషయం తెలిసిందే.

Also read: Goa elections 2022 : మాజీ సీఎం కుమారుడు అయినంత మాత్రానా సీటు ఇవ్వం..

Also read: Up election 2022: భాజపాకు మరో షాక్.. మరో మంత్రి గుడ్ బై..ఎస్పీలో చేరే అవకాశం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News