India vs West Indies 3rd ODI: ఒత్తిడిలో ఇండియా.. ఉత్సాహంతో విండీస్.. నిర్ణయాత్మకమైన చివరి వన్డే నేడే..!
India vs West Indies: భారత్, విండీస్ మధ్య చివరి వన్డే ఇవాళ జరగనుంది. ఇరు జట్లు కప్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తరోబా వేదిక జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 07 గంటలకు మెుదలుకానుంది.
India vs West Indies 3rd ODI live streaming: వెస్టిండీస్, టీమిండియాల మధ్య నిర్ణయాత్మక చివరిదైన మూడో వన్డే నేటి నుంచి ప్రారంభం కానుంది. ఒత్తిడిలో భారత్ ఉంటే.. రెండో వన్డేలో గెలిచిన ఉత్సాహంతో ఆతిథ్య జట్టు ఉంది. ఈ మ్యాచ్ ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాత్రి 7 గంటలనుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
రోహిత్, కోహ్లీ ఆడతారా?
ప్రయోగాల పేరుతో రెండో వన్డేలో పక్కన పెట్టేసిన కెప్టెన్ రోహిత్, కోహ్లిలను ఈ మ్యాచ్ లోనైనా ఆడిస్తారా లేదా కుర్రాళ్లకే అవకాశమిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిద్దరిలో ఒక్కరినే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్ తుది జట్టులో ఉంటాడని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈసారి హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్లుగా మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్, గిల్ అలానే కొనసాగే అవకాశం ఉంది. మరోసారి శాంసన్, సూర్యకుమార్‌కు టీమ్ లో చోటుదక్కవచ్చు. టీ20లో రాణిస్తున్న సూర్య.. వన్డేల్లో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. గత మ్యాచ్ లో శాంసన్ కూడా సరిగా ఆడలేదు. వీరిద్దరూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. యువ పేసర్లు ముకేష్, ఉమ్రాన్ రాణించాల్సి ఉంది. కుల్ దీప్, జడేజా, శార్ధూల్ మరోసారి ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు.
విండీస్ ఆశలన్నీ అతడిపైనే..
రెండో వన్డేలో విజయంతో సిరీస్ సమం చేసిన కరీబియన్ జట్టు ఇప్పుడు ఎలాగైనా సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు వన్డేల్లో వరుసగా 43, 63 పరుగులు చేసిన కెప్టెన్ షై హోప్‌పై ఆ జట్టు మరోసారి ఆశలు పెట్టుకుంది. అతనితో పాటు మేయర్స్, కింగ్, కార్టీ, అథనేజ్, హెట్‌మయర్‌తో బ్యాటింగ్‌లో రాణించగల సమర్థులే. స్పిన్నర్ మోటీ మరోసారి భారత్ బ్యాటర్లకు సవాల్ విసరనున్నాడు. పేసర్ రొమారియో షెఫర్డ్ రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్ తరోబాలోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ జరుగుతున్న తొలి మెన్స్ వన్డే మ్యాచ్ ఇదే.
Also Read: Jasprit Bumrah: బూమ్రా బ్యాక్, ఐర్లండ్ పర్యటనలో టీమ్ ఇండయా సారధ్య బాధ్యతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook