Cricket Records: వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాట్స్‌మెన్ వీళ్లే..!

Highest Average In ODI Cricket: క్రికెట్‌లో ఓ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో ఎలా ఆడాడని యావరేజ్‌ను చూసి చెప్పొచ్చు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సగటు (కనీసం 100 ఇన్నింగ్స్‌లు)ను కలిగిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో టీమిండియా రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. టాప్-5 జాబితాలో ఉన్న బ్యాట్స్‌మెన్‌పై ఓ లుక్కేయండి.
 

1 /5

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 57.32 బ్యాటింగ్ సగటును కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సగటు ఇదే.. వన్డే క్రికెట్‌లో 13 వేల పరుగులు పూర్తి చేయడానికి ఇంకా 102 పరుగులు అవసరం.   

2 /5

వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షెయ్ హోప్ 117 వన్డేలు ఆడగా.. సగటు 50.87గా ఉంది.  ఇప్పటివరకు 15 సెంచరీలు, 24 అర్ధసెంచరీలతో 4,935 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచ కప్ నుంచి 54 ఇన్నింగ్స్‌లలో 2,414 పరుగులు చేశాడు.   

3 /5

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 350 వన్డే మ్యాచ్‌ల సగటు 50.57గా ఉంది. ధోనీ తన వన్డే కెరీర్‌లో 10,773 పరుగులు చేశాడు.   

4 /5

ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ బెవన్ వన్డే సగటు 53.58. బెవాన్ 232 వన్డేల్లో 6,912 పరుగులు చేసి రిటైరయ్యాడు.   

5 /5

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 101.7 స్ట్రైక్ రేట్‌తో 53.5 సగటుతో వన్డేల్లో పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో డివిలియర్స్ 9,577 పరుగులు చేశాడు.