Qatar Masters 2023 Live Updates: ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ ను ఖతార్ మాస్టర్స్ 2023లో భారత కుర్రాడు షాకిచ్చాడు.  ఏడో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్‌ ఓడించాడు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 24 ఏళ్ల ఈ కుర్రాడు నల్లపావులతో బరిలోకి దిగి ప్రపంచ నెంబర్‌ వన్‌ను మట్టికరిపించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌, హరికృష్టలు తర్వాత  కార్ల్‌సన్‌ను ఓడించిన మూడో భారతీయ చెస్‌ క్రీడాకారుడిగా కార్తికేయన్‌ రికార్డులకెక్కాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హరికృష్ట 2005లో, విశ్వనాథన్‌ 2022 నార్వే చెస్‌ టోర్నీలో కార్ల్‌సన్‌ను ఓడించారు. తాజా గెలుపుతో కార్తికేయన్ వారి సరసన స్థానం సంపాదించాడు. తంజావూరుకు చెందిన కార్తికేయన్‌ ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 163వ స్థానంలో ఉన్నాడు. ఇతడు గతంలో రెండు సార్లు నేషనల్‌ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు. 


భారత్ ఆటగాళ్లు ఈ మధ్యన విశ్వవేదికలపై తమ సత్తాను చాటుతున్నారు. ఒకప్పుడు చెస్ అంటే విశ్వనాథన్ ఆనంద్ పేరే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు యువ గ్రాండ్ మాస్టర్స్ సైతం ప్రపంచ వేదికలపై సంచనాలు రేపుతున్నారు.  ఇటీవలే వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 


Also Read: SA vs Netherlands: మీరెక్కడ తగులుకున్నారా..! అప్పుడు.. ఇప్పుడు సఫారీకి అదే జట్టు షాక్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook