SA vs Netherlands: మీరెక్కడ తగులుకున్నారా..! అప్పుడు.. ఇప్పుడు సఫారీకి అదే జట్టు షాక్..!

Temba Bavuma Pic Goes Viral: నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమితో ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. ఈ పరాజయంతో సఫారీ కెప్టెన్ తెంబా బావుమా నిరాశకు గురైన పిక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 18, 2023, 03:23 PM IST
SA vs Netherlands: మీరెక్కడ తగులుకున్నారా..! అప్పుడు.. ఇప్పుడు సఫారీకి అదే జట్టు షాక్..!

Temba Bavuma Pic Goes Viral: ఈ వరల్డ్‌కప్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఇంగ్లాండ్‌కు ఆఫ్ఘానిస్తాన్ షాక్ ఇవ్వగా.. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ మట్టికరిపించింది. దీంతో పెద్ద షాట్లకు భయం పట్టుకుంది. నెదర్లాండ్స్‌తో ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరు ఔట్ అవుతూ ఉంటే.. తెల్లటి టవల్‌లో చుట్టుకుర్చొని దీనంగా ఉన్నాడు. అతని ముఖమంతా బాధలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో మీమ్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. గత టీ20 ప్రపంచకప్‌లో కూడా నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఇంటి ముఖం పట్టిన విషయం తెలిసిందే. ఏడాది తరువాత వన్డే వరల్డ్ కప్‌లోనూ అదే ఫీట్ రిపీట్ అయింది. 

 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో 245 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రాణించడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేసింది. 27 ఓవర్లలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజ్‌లోకి వచ్చిన ఎడ్వర్డ్స్.. 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 69 బంతుల్లో 78 పరుగులు చేశాడు. చివర్లో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (29), ఆర్యన్ దత్ (23) వేగంగా ఆడారు.

వరుస విజయాలతో జోరు మీద ఉన్న దక్షిణాఫ్రికాకు ఈ లక్ష్యం సరిపోదనింపించింది. ఓపెనర్లు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, తెంబా బావుమాతో తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. ఆ తరువాత వికెట్ల పతనం ఆరంభమైంది. 8 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం డేవిడ్ మిల్లర్,హెన్‌క్రిచ్ క్లాసెన్ ఇన్నింగ్స్‌ను కాసేపు వికెట్ల పతనాన్ని అడుకున్నా.. మళ్లీ నెదర్లాండ్స్ బౌలర్లు చెలరేగారు. చివరికి 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయ్యారు. లోగాన్ వాన్ బీక్ 3, పాల్ వాన్ మీకెర్న్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, బాస్ డి లీడే తలో రెండు, కోలిన్ అకెర్‌మాన్ ఒక వికెట్ తీశారు. 

రెండు మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఏకపక్షంగా ఓడించిన దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు మ్యాచ్‌ల్లో ఆడిన తీరు చూస్తే.. కచ్చితంగా సెమీస్ చేరుకుంటుందని అందరూ అంచనా వేశారు. అయితే నెదర్లాండ్స్‌పై పరాజయంతో సఫారీ జట్టు విమర్శలు ఎదుర్కొంటోంది. 

ఇది కూడా చదవండి: NED VS SA: వరల్డ్ కప్ లో మరో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్..

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook 

 

Trending News