Rahu Transit 2023: గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో పరివర్తనం చెందుతుంటాయి. ఇదే గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనం. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే విధంగా రాహు కేతువులు కూడా నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటాయి.
హిందూ జ్యోతిష్యంలో మాయా గ్రహంగా పిలిచే రాహువు అక్టోబర్ 30న మీన రాశిలో ప్రవేశించనుంది. ఈ రాశి పరివర్తన ంప్రభావం కొన్ని రాశులకు అత్యంత దురదృష్టకరంగా ఉంటుంది. ఈ సమయంలో అన్నీ కష్టాలే ఎదురౌతాయి. అందుకే డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవల్సి ఉంటుంది. మీనరాశిలో రాహువు మార్చ్ 2025 వరకూ ఉంటాడు. రాహువు మీనరాశి పరివర్తనం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యందా తుల, వృశ్చిక,స ధనస్సు రాశివారికి చాలా ప్రతికూలంగా ఉండనుంది.
వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మార్చ్ 2025 వరకూ కష్టాలు తప్పవు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం ఆర్ధికంగా నష్టదాయకం కానుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్ని సంయమనంతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. మొత్తానికి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది
రాహువు మీన రాశిలో మార్చ్ 2025 వరకూ ఉండటం వల్ల అప్పటి వరకూ ధనస్సు రాశి జాతకులకు చాలా కష్టమైన సమయంగా భావించాలి. వ్యాపారం విస్తృతమౌతుంది గానీ కుటుంబానికి సమయం వెచ్చించలేక ఆదో సమస్యగా మారుతుంది. భూములు, ఆస్థులు కొనుగోలు చేసే ఆలోచన ఉంటే చట్టపరమైన సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే మోసపోయే ప్రమాదముంది.
తుల రాశి జాతకులు సైతం మీన రాశిలో రాహువు ప్రభావాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. వ్యాపారం కోసం లేదా మరేదైనా అత్యవసర పని కోసం తీసుకున్న అప్పు బాధించవచ్చు. అంటే ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే అత్యవసరం అయితే తప్ప తీసుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అయితే కష్టపడితే మాత్రం మంచి ఫలితాలుంటాయి. మీ అభివృద్ధికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Also read: Budh Gochar 2023: రేపటి నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి.. ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook