David Warner: ఐపీఎల్‌లో సరిలేరు నీకెవ్వరూ
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, డివిలియర్స్‌లు సైతం అతడిని అందుకోలేకపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 50 సార్లు 50కి పైగా స్కోరు చేసిన ఏకైక, తొలి ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఐపీఎల్ 2020 (IPL 2020)లో భాగంగా అక్టోబర్ 8న రాత్రి అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ (52) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్‌లో 50 ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోరు చేసిన తొలి, ఏకైక ఐపీఎల్ క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) అరుదైన ఘనత సాధించాడు.
వార్నర్ కేవలం 132 ఐపీఎల్ మ్యాచ్‌లు, ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వార్నర్ 4 శతకాలు, 46 అర్ధ శతకాల సాయంతో 4,933 పరుగులు చేశాడు. వార్నర్ తర్వాత విరాట్ కోహ్లీ 5 శతకాలు, 37 అర్ధ శతకాలతో మొత్తం 42 ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోరు సాధించాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మలు సంయుక్తంగా 39 ఇన్సింగ్స్‌లలో 50కి పైగా స్కోరు (1 సెంచరీ, 38 హాఫ్ సెంచరీలు) చేశారు. ఏబీ డివిలియర్స్ 38 ఐపీఎల్ మ్యాచ్‌లలో 50కి పైగా పరుగులు (3 శతకాలు, 35 అర్ధ శతకాలు) సాధించాడు.
Also Read : CSK loss to KKR: ఐపీఎల్ చరిత్రలో చెన్నై అలా ఓడటం తొలిసారి.. రికార్డులకు బ్రేక్!
వార్నర్ కేవలం 132 ఇన్నింగ్స్‌లలో 50 పర్యాయాలు 50కి పైగా చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కోహ్లీ 174 ఇన్నింగ్స్‌లలో 42 పర్యాయాలు, రైనా, రోహిత్ 189 ఇన్నింగ్స్‌లలో 39 పర్యాయాలు, డివిలియర్స్ 147 ఇన్నింగ్స్‌లలో 38 పర్యాయాలు మాత్రమే 50కి పైగా స్కోరు చేయడం గమనార్హం. ఈ టాప్ 5 క్రికెటర్లలో అతి తక్కువ మ్యాచ్‌లు, ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మన్ సైతం డేవిడ్ వార్నరే కావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe