SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ( Kings XI Punjab ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్ ( KXIP ).. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది.

Last Updated : Oct 9, 2020, 02:47 AM IST
SRH vs KXIP match highlights: పంజాబ్‌ని చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపిఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ( Kings XI Punjab ) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) 69 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) నిర్ధేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన పంజాబ్ ( KXIP ).. మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభంలోనే తడబడిన పంజాబ్ ఆటగాళ్లు.. పెద్దగా పరుగులు రాబట్టకుండానే పెవిలియన్ బాటపట్టారు. ఆ ఒరవడి అలా చివరి వరకు కొనసాగుతూ వచ్చింది. Also read : Brian Lara: ధోనీ ఆటతీరుపై బ్రియాన్ లారా కామెంట్స్

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన నికోలస్ పూరన్ ( Nicholas Pooran 77; 37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు ) మాత్రం దాదాపు చివరి వరకు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. కానీ అతడి దూకుడుకి రషీద్ ఖాన్ ( Rashid Khan ) తన బంతితో అడ్డుకట్ట వేయడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్కోర్ బోర్డ్ మళ్లీ వేగం తగ్గింది. 14.5వ ఓవర్ వద్ద జట్టు స్కోర్ 126 గా ఉన్నప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తంగరసు నటరాజన్‌కి క్యాచ్ ఇచ్చి పూరన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సరిగ్గా రెండు ఓవర్లలోనే మరో ఆరు పరుగులకే ముగ్గురు ఆటగాళ్లు ఔట్ అయ్యారు. దీంతో కేవలం 132 పరుగులకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చాప చుట్టేసింది. సన్‌‌రైజర్స్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా ఖలీల్‌ అహ్మద్‌, నటరాజన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అభిషేక్‌ శర్మ ఒక వికెట్ తీశాడు. Also read : IPL 2020: హైదరాబాద్ వర్సెస్ పంజాబ్..ఎవరి బలమెంత?

Sunrisers Hyderabad బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టేన్ డేవిడ్ వార్నర్ ( David Warner 52 పరుగులు; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ శతకం సాధించి.. ఐపిఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై వరుసగా తొమ్మిదో హాఫ్‌ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో 2015 నుంచి 2020 వరకు పంజాబ్‌పై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 

మరో ఓపెనర్ బెయిర్‌ స్టో ( Jonny Bairstow ) 97 పరుగులు ; 55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) స్కోర్‌ను పరుగులెత్తించాడు. దూసుకెళ్తున్న బెయిర్‌స్టో పంజాబ్ స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్‌లో ( Ravi Bishnoi ) ఎల్బీడబ్ల్యూ అవడంతో 3 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లంతా తక్కువ బంతుల్లోనే స్వల్ప స్కోరుకే ఔట్ అయ్యారు. ఒక్కే కేన్ విలియమ్సన్ ( Kane Williamson 20 ; 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ ) తప్ప మిగతా ఎవ్వరూ ఆ మాత్రం కూడా రాణించలేదు. పంజాబ్ బౌలర్ రవి బిష్ణోయ్‌ మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, మహ్మద్ షమి మరో వికెట్ తీసుకున్నారు. Also read : KKR vs CSK match: చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా విజయం.. ధోనీకి మళ్లీ తప్పని ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News