ఐపీఎల్ 2020 ( IPL 2020 Final ) తుదిపోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. యూఏఈ ( UAE ) వేదికగా జరుగుతున్న పోరులో రెండు జట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ పోరులో విజేత ఎవరు.. ఏ టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయి..అనేది కాస్సేపు విశ్లేషిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) , ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టు మూడుసార్లు పోటీ పడినా..విజయం ముంబై ఇండియన్స్ నే వరించింది. మరోసారి  ఢిల్లీని ఓడించి కప్ గెల్చుకునేందుకు ఐపీఎల్ 2020 హాట్ ఫేవరైట్ ముంబై ఇండియన్స్ భావిస్తోంది. పక్కా వ్యూహంతో క్వాలిఫయర్ 2లో హైదరాబాద్ ను ఓడించినట్టే ముంబైను ఓడించాలని ఢిల్లీ యోచిస్తోంది.


MI vs DC Final IPL 2020లో తుది పోరు దుబాయ్ వేదికగా జరగనుంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లే అగ్రస్థానంలో ఉన్నాయి.  రెండూ సమ ఉజ్జీలు కావడంతో విజేత ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.   


ఇక మొత్తం ఐపీఎల్‌ ( IPL ) లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు తలపడగా..14 సార్లు ముంబై విజయం సాధించగా..12 సార్లు ఢిల్లీ గెలిచింది. అక్టోబరు 11న జరిగిన అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత అక్టోబరు 31న జరిగిన దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టు విజయం సాధించింది.   నవంబరు 5న జరిగిన క్వాలిఫైయర్-1లో సైతం ఢిల్లీని ఓడించింది.  Also read: IPL 2020 Final: ఢిల్లీ నడ్డి విరిచేందుకు రోహిత్ పక్కా వ్యూహం!


రెండు జట్లను పోల్చి చూస్తే.. ముంబై టీమ్ ( Mumbai Team ) బలంగా కనిపిస్తుంది. డికాక్, రోహిత్, సూర్య, ఇషాన్ రూపంలో శక్తివంతమైన టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఉంది. ఇక పొలార్డ్, హార్దిక్ పాండ్యా వంటి పవర్ ఫుల్ హిట్టర్‌లు ఉండనే ఉన్నారు. బుమ్రా, బోల్ట్ రూపంలో ప్రత్యర్థులను దెబ్బకొట్టే బలమైన బౌలర్లు ఉన్నారు.  


ఇక ఢిల్లీ జట్టు ( Delhi team ) ను పరిశీలిస్తే..శిఖర్ ధావన్ ఫామ్‌లో ఉండడం ఢిల్లీకి లాభించే అంశం. డీసీ బ్యాట్స్‌మెన్‌లో ఆడితే అందరూ బాగా ఆడటం లేదా అందరూ విఫలమవడం ఓ మైనస్ పాయింట్. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చి సక్సెస్ అయింది. ఇవాళ కూడా ఢిల్లీ జట్టు ఇదే వ్యూహాన్ని అవలంభించవచ్చు. బౌలింగ్‌లో నార్జీ, రబడ అద్భుతంగా రాణిస్తున్నారు. 


దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డ్యూ ఫ్యాక్టర్ కీలక భూమిక పోషించే అవకాశముంది. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశముంది. ప్లేఆఫ్స్‌లో టాస్ గెలిచిన జట్లే విజయం సాధించాయి. ఛేజింగ్ విషయంలో 2 సార్లు విజయం 4 సార్లు పరాజయం ఎదురైంది. Also read: IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?