SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!
Sunrisers Hyderabad IPL 2020 Playoffs Chances | ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా ఆడి ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మరో ఆరు జట్ల ముందున్న లక్ష్యం ప్లేఆఫ్స్‌కే అర్హత సాధించడం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సమష్టిగా ఆడి ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సహా మరో ఆరు జట్ల ముందున్న లక్ష్యం ప్లేఆఫ్స్ (SRH Playoffs)కు అర్హత సాధించడం. అయితే షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ప్లేఆఫ్ రేసు ఆశలను సన్‌రైజర్స్ హైదరాబాద్ సజీవంగా నిలుపుకుంది. కానీ మరో గండాన్ని గట్టెక్కాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటికే.
సన్‌రైజర్స్‌కు ముందున్నది అసలు పరీక్ష. 9 మ్యాచ్‌లలో విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లేఆఫ్స్‌కు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ రేసు నుంచి తప్పుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. దీంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందా లేదా తెలియాలంటే లీగ్ దశ చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.
సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధిస్తే ఏ అనుమానం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కే చేరుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడితే.. అంతకుముందు నేడు చెన్నైతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆర్సీబీ, డీసీ మధ్య పోరులో ఒక జట్టు గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో రెండు స్థానాల కోసం మిగతా 4 జట్లు బరిలో ఉంటాయి. అయితే కేకేఆర్, ఆర్ఆర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సైతం ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే నేటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో పంజాబ్ ఓడిపోవాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ కచ్చితంగా తమ చివరి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించాలి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా నాలుగో స్థానంతోనైనా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరుతుంది. సన్‌రైజర్స్ ఆ మ్యాచ్‌లో ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.
Also Read : Chris Gayle: తప్పేనన్న యూనివర్సల్ బాస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe