Steve Smith: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!
ముంబై ఇండియన్స్ చేతిలో 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు (Steve Smith fined RS 12 Lakh) భారీ షాకిచ్చారు.
రాజస్థాన్ రాయల్స్ (Rajastan Royals) కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. రూ.12 లక్షల భారీ జరిమానా విధించారు. అబుదాబిలో మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ కారణంగా స్టీవ్ స్మిత్ (Steve Smith fined RS 12 Lakh)కు జరిమానా విధిస్తున్నట్లు లీగ్ నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ఈ జరిమానాను ఎదుర్కొన్న తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీ.
కాగా, అక్టోబర్ 6న రాత్రి అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 136 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్‌పై 57 పరుగుల తేడాతో ముంబై భారీ విజయాన్ని అందుకుంది.
మరో ఘోర పరాజయం తప్పలేదు. IPL 2020 లో భాగంగా మంగళవారం రాత్రి ఆడిన 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుతో తలపడిన రాజస్థాన్ రాయల్స్.. 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై ఇండియన్స్ సమిష్టి కృషితో రాణించగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు మెుత్తం సమిష్టిగా విఫలమై ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముందు టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌లో ఇది హ్యాట్రిక్ విజయం, కాగా, ఐపీఎల్ 2020లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తొలి జట్టుగా రోహిత్ శర్మ సేన నిలిచింది. మరోవైపు ముంబై చేతిలో ఓటమితో రాజస్థాన్ హ్యాట్రిక్ ఓటములు మూటకట్టుకుంది. 5 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. రాజస్థాన్‌పై నెగ్గి 4వ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానంలోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe