Virat Kohli Fined: RCB కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో ఓటమిపాలైన బాధలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) చేతిలో ఓటమిపాలైన బాధలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో పంజాబ్‌తో మ్యాచ్‌లో భాగంగా స్లో ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించారు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. RCB vs KXIP: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
‘ఇది తొలి తప్పిదం కారరణంగా ఐపీఎల్ నియమావళి ప్రకారం.. స్లో ఓవర్ రేట్ జట్టు కెప్టెన్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించామని’ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో వీర విహారం చేయడంతో ఆర్సీబీ 97 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటకట్టుకుంది.
కాగా, మరోవైపు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. దాంతో పాటుగా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత క్రికెటర్‌గా అరుదైన ఫీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్‌ను ఔట్ పదే పదే బౌలింగ్‌లో మార్పులు చేయడం కూడా స్లో ఓవర్ రేట్‌కు ఓ కారణమైంది.
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe