RCB vs KXIP match: రాహుల్ సెంచరీతో పంజాబ్ ఘన విజయం.. బెంగళూరు ఘోర పరాజయం

ఐపీఎల్‌ 2020లో 6వ మ్యాచ్‌లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల ( KXIP vs RCB ) మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పంజాబ్‌ జట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ కెప్టేన్ కేఎల్ రాహుల్ ( KL Rahul score against RCB ) ఏకంగా 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో జట్టుకు భారీ విజయం అందించాడు. 

Updated: Sep 25, 2020, 01:30 AM IST
RCB vs KXIP match: రాహుల్ సెంచరీతో పంజాబ్ ఘన విజయం.. బెంగళూరు ఘోర పరాజయం
Image Credits: Twitter/@IPL

IPL 2020లో 6వ మ్యాచ్‌లో భాగంగా గురువారం రాత్రి కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల ( KXIP vs RCB ) మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై పంజాబ్‌ జట్టు అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్ అంతా వన్ మేన్ షో అన్నచందంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టేన్ కేఎల్ రాహుల్ ( KL Rahul score against RCB ) ఏకంగా 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో జట్టుకు భారీ విజయం అందించాడు. రాహుల్ బౌండరీల సునామితో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. Also read : Rohit Sharma SIXES in IPL: సిక్సర్లలో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. కోహ్లీ ఎక్కడ? 

207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పంజాబ్ జట్టు స్కోరును అందుకునే పరిస్థితి కనిపించకపోగా.. 17 ఓవర్లకే 109 పరుగులకే ఆలౌట్ అయిన తీరు చూస్తే.. పంజాబ్ జట్టు బౌలర్లు బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌ని ఎంత కట్టడి చేశారో ఇట్టే అర్థమవుతుంది. Royal challengers Bengaluru  ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్‌ (20), ఏబి డివిలియర్స్‌ (28), వాషింగ్టన్‌ సుందర్‌ (30), శివం దూబే (12)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగితా బాట్స్‌మెన్స్ అందరూ పంజాబ్ బౌలర్ల మణికట్టు మాయజాలం ముందు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ( SRH vs RCB ) జరిగిన తొలి మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌ ( Devdutt Padikkal ) కూడా ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాటపట్టాడు. జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. కష్టకాలంలో జట్టును గట్టెక్కించే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ( Virat Kohli ) (1) సైతం కాట్రెల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రవి బిష్నోయ్‌ చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ముఖ్యమైన ఆటగాళ్లే ఏమీ చేయలేనట్టు చేతులెత్తేయడంతో ఆ తర్వాతి ఆటగాళ్లంతా వాళ్ల బాటలోనే పెవిలియన్ చేరుకున్నారు. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 97 పరుగుల భారీ తేడాతో Punjab జట్టు చేతిలో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. Also read : RR vs CSK match Highlights: ధోనీ సేనపై గెలిచిన Rajasthan Royals.. గెలిపించింది ఎవరు ? ఓడించింది ఎవరు ?

ఇండియన్ రన్ మెషిన్‌గా పేరున్న Virat Kohli కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇంతటి ఘోర పరాజయం పాలవడం క్రికెట్ ప్రియులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe