IPL 2021 Auction: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL 2021‌) మినీ వేలాకి అంతా సిద్ధం చేశారు. చెన్నై వేదికగా  గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి తాజా మినీ వేలం ప్రారంభ‌ం కానుంది. అయితే విదేశీ ఆటగాళ్లు కన్నా స్వదేశీ ఆటగాళ్లపై ఫోకస్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2021 మినీ వేలం(IPL 2021 Auction)లో మొత్తం 292 మంది ఆటగాళ్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనండగా, 64 మంది డోమెస్టిక్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో కేవలం అయిదుగురిలో ఒకరని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, అర్జున్ టెండూల్కర్ లాంటి పలువురు ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.


Also Read: Du Plessis Retirement: 2 కోరికలు తీరకుండానే క్రికెటర్ Faf Du Plessis రిటైర్మెంట్ 


డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియ‌న్స్ జట్టు వద్ద ప్రస్తుతం రూ.15.35 కోట్లు ఉంది. ముంబై టీమ్ మొత్తం 7 మందిని తీసుకునే ఛాన్స్ ఉంది.


ఐపీఎల్ 2020 రన్నరప్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జట్టు వద్ద ప్రస్తుతం రూ.13.04 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ 8 మంది వరకు తీసుకోవచ్చు.


ఐపీఎల్‌లో మరో ముఖ్యమైన జట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings)‌ వద్ద ప్రస్తుతం రూ.19.9 కోట్లు ఉన్నాయి. సీఎస్కే మేనేజ్‌మెంట్ ఆరుగురిని తీసుకోబడానికి ఛాన్స్ ఉంది.


Also Read: Ind vs Eng 2nd Test Live Updates: భారీ విజయంతో ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న Team India


మరో టైటిల్ నెగ్గాలని భావిస్తున్న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌‌తో రూ.10.75 కోట్లు ఉన్నాయి. గరిష్టంగా 8 మందిని తీసుకోవచ్చు.  


మాజీ ఛాంపియన్ స‌న్‌రైజర్స్ హైద‌రాబాద్‌ వద్ద రూ.10.75 కోట్లు ఉన్నాయి. వీటితో గరిష్టంగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటుంది.


Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే..  


విరాట్ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) వద్ద రూ.35.4 కోట్లు ఉండగా.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో గరిష్టంగా 14 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు.  
పేరు మార్చుకుని వస్తున్న పంజాబ్ కింగ్స్ వద్ద అధికంగా రూ.53.2కోట్లు ఉన్నాయి. పంజాబ్ టీమ్ గరిష్టంగా 9 మందిని తీసుకునే అవకాశం ఉంది. 


ఐపీఎల్ తొలి టైటిల్ నెగ్గిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ వద్ద రూ.15.35 కోట్లు ఉన్నాయి. ఆర్ఆర్ మేనేజ్‌మెంట్ 9 మంది వరకు ఆటగాళ్లను తీసుకోవచ్చు.


Also Read: Ravichandran Ashwin: 33 ఏళ్ల తర్వాత తొలి క్రికెటర్‌గా అశ్విన్ అరుదైన రికార్డు, Englandపై పరుగుల మోత      


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook