IPL 2021 Suspension: టీ20 లీగ్స్‌పై CSK ఆటగాడు Faf du Plessis కీలక వ్యాఖ్యలు
CSK Player Faf du Plessis statement on T20 leagues: ఆటగాళ్లు టీ20 లీగ్స్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేవలం వచ్చే 10 ఏళ్లలోనే సాకర్ పరిస్థితి అంతర్జాతీయ క్రికెట్‌కి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ వ్యాఖ్యానించాడు.
CSK Player Faf du Plessis statement on T20 leagues: కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021ను తిరిగి ప్రారంభిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట కరోనా కేసుల కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ జూన్ 9న తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
ట్వంటీ20 లీగ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదకారిగా మారుతున్నాయని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ (Faf Du Plessis) అభిప్రాయపడ్డాడు. గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఒకటో రెండో టీ20 లీగ్‌లు మాత్రమే నిర్వహించేవారని, అది ఆటగాళ్లకు ప్రయోజనకరంగా ఉండేదని, ప్రస్తుతం లీగ్‌ల సంఖ్య దాదాపు 7కు చేరుకుందన్నాడు. ఈ లీగ్‌ల నిర్వహణతో అంతర్జాతీయ క్రికెట్‌కు ముప్పుగా మారుతాయన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందు వర్చువల్ సమావేశంలో పాల్గొన్న డుప్లెసిస్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Team India: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఘన విజయం, Sunil Gavaskar ధీమా
భవిష్యత్తులో ఒకేసారి టీ20 లీగ్, అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తే ఆటగాళ్లకు అసలైన సవాల్ మొదలవుతుందన్నాడు. డుప్లెసిస్ పీఎస్‌ఎల్‌లో పెషావర్ జల్మీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ టీ20 లీగ్స్ పరిమిత సంఖ్యలోనే ఉండాలి. రోజురోజుకూ క్రికెట్‌లో వాటి ప్రభావం పెరుగుతోంది. స్థానిక, దేశవాలీ లీగ్స్‌కు ప్రాధాన్యం ఇదే తీరుగా పెరిగితే ప్రస్తుతం సాకర్ పరిస్థితి క్రికెట్‌కు పడుతుంది. కేవలం వచ్చే 10 ఏళ్లలోనే సాకర్ పరిస్థితి అంతర్జాతీయ క్రికెట్‌గా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు బదులుగా ఆటగాళ్లు స్థానిక లీగ్స్, టీ20 లీగ్స్ ఆడేందుకు ఆసక్తి చూపుతారు.
Also Read: T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై BCCIకి ఐసీసీ డెడ్‌లైన్
ఉదాహరణకు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో లాంటి ఆటగాళ్లు ఫ్రీలాన్స్ క్రికెటర్లుగా మారిపోతున్నారు. తద్వారా వారి జాతీయ జట్టు వెస్టిండీస్‌కు ఎంతో నష్టం వాటిల్లుతుంది. నేను మాత్రం కేవలం రెండు మూడు లీగ్స్‌కు పరిమితమైతే బాగుంటుందని భావిస్తున్నాను. విండీస్ విషయానికొస్తే ఆటగాళ్లు IPL 2021 లాంటి టీ20 లీగ్స్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు కళ తప్పింది. జాతీయ జట్టుగా విఫల్యాల బాట పట్టిందని’ డుప్లెసిస్ తన అభిప్రాయాలను బహిర్గతం చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook