Team India will win Test series 4-0 Against England: టీమిండియా భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు యూకేకు చేరుకున్నాయి. క్వారంటైన్‌లో కసరత్తులు మొదలుపెట్టారు. తొలుత విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడుతుంది. జూన్ 18న సౌతాంప్టన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది.
ఈ టెస్టులో అధిక సమయం ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్ డే సైతం ఇవ్వాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ సేన అద్బుతాలు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టుపై 4-0 తేడాతో భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ తరువాత ఇంగ్లాండ్ గడ్డ మీద టెస్టుల్లో రాణించిన Team India బ్యాట్స్‌మన్‌గా సునీల్ గావర్క్ పేరిట రికార్డులున్నాయి. టెలీగ్రాఫ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించాడు. టీమిండియాకు అనుకూల ఫలితాలు వస్తాయని, ఆటగాళ్లపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
Also Read: Team India captain Virat Kohli: టీమిండియా భవిష్యత్తుపై విరాట్ కోహ్లీ అంచనా ఇదే
‘ఇంగ్లాండ్‌లో ఎవరైనా ఆటగాడు బంతిని సాధ్యమైనంత ఆలస్యంగా ఆడటం సరైన నిర్ణయం. గాలిలో బంతి వేరియేషన్ అయ్యే అవకావం అధికంగా ఉంటుంది. ఇక్కడి పిచ్‌లు ఆస్ట్రేలియా గడ్డను తలపిస్తాయి. లైన్ అండ్త్ లెన్త్ బంతులను ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌లో నా టెస్టు కెరీర్ అరంగేట్రం తరువాత ఇంగ్లాండ్‌లో ఆడాను. కానీ విండీస్ పిచ్‌లతో పోల్చితే ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. విండీస్ గడ్డపై బంతి బ్యాట్ మీదకు రాలేదు. కానీ ఇంగ్లీష్ పిచ్‌లలో బంతి నేరుగా బ్యాట్ మీదకు దూసుకొస్తాయి. దీంతో తొలి పర్యటనలో సెంచరీ చేయలేకపోయాను.
Also Read: Babar Azam Engagement: పెళ్లికి సిద్ధమైన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్, వధువు ఎవరంటే
కానీ 1974లో రెండోసారి ఇంగ్లాండ్‌లో పర్యటించాను. తొలి టెస్టులోనే శతకం సాధించా. ద ఓవల్ మైదానంలో చేసిన 221 డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ నా బెస్ట్ ఇన్నింగ్స్ కాదు. మాంచెస్టర్‌లో చేసిన శతకం నా బెస్ట్ టెస్ట్ శతకం. ప్రస్తుం టీమిండియాలో చాలా మార్పులొచ్చాయి. ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన అనుభవం వారి సొంతం. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగించుకుని ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యారు. జూన్‌లో బంతి గమనం వేగంగా మారుతుంది. కనుక పేసర్లను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆగస్టు- సెప్టెంబర్ నెలలో టెస్ట్ సిరీస్ జరిగితే టీమిండియా 4-0 తేడాతో విజయం సాధిస్తుందని’ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ధీమా వ్యక్తం చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook