Deepak Hooda wants to play under MS Dhoni Captaincy: మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో తాను పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్నా.. వ్యక్తిగతంగా ఫేవరెట్‌ జట్టు మాత్రం చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే) అని భారత యువ ఆటగాడు దీపక్‌ హుడా చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ టీమ్ అయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. దాంతో దీపక్‌ వేలంలోకి వచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో దీపక్‌ హుడాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కరోనా బారిన పడడంతో హుడాకు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో క్యాష్ రిచ్ లీగులో పలు జట్లకు ఆడిన దీపక్‌ హుడా.. భారత జాతీయ జట్టుకు ఎంపికావడం మాత్రం ఇదే మొదటిసారి. తాజాగా ఇండియా న్యూస్‌లో జరిగిన చర్చలో హుడా పలు విషయాలపై స్పందించాడు. 


'ఐపీఎల్‌లో నేను మొన్నటి వరకు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడినా.. వ్యక్తిగతంగా నా ఫేవరెట్‌ జట్టు మాత్రం చెన్నై సూపర్‌ కింగ్స్. చెన్నై కెప్టెన్‌ ఎంఎస్ ధోనీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా చాలా సార్లు మహీతో మాట్లాడాను. ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరుగనున్న ఐపీఎల్‌ మెగా వేలం గురించి నేను ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఫిబ్రవరి 6న ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్‌ గురించే' అని చెప్పాడు. 


ఐపీఎల్‌లో దీపక్‌ హుడా సన్ రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్‌), రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్‌), పంజాబ్‌ కింగ్స్‌ (పీబీకేఎస్‌) జట్ల తరఫున ప్రాతినిథ్యం వహించాడు. హుడా 80 ఐపీఎల్ మ్యాచులు ఆడి 785 పరుగులు చేశాడు. ఎక్కువగా ఇన్నింగ్స్ చివరలో బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. 67 లిస్ట్ ఏ మ్యాచులలో 2257 రన్స్ బాదాడు. ఈసారి వేలంలో మనోడికి మంచి ధరే రానుంది. 


Also Read: Yash Dhull Six: పిచ్‌పై డాన్స్ చేస్తూ సిక్స్ కొట్టిన టీమిండియా ప్లేయర్ (వీడియో)!!


Also Read: Attack on Asaduddin Owaisi: అప్పుడు అక్బరుద్దీన్ ఒవైసిపై కాల్పులు.. ఇప్పుడు అసదుద్దీన్ ఒవైసి కారుపై కాల్పులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook