CSK vs MI: ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై ఇండియన్స్ చేతిలో కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ ఇది. ముంబైకు అంతగా ప్రాధాన్యత లేకపోయినా..చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గెలవక తప్పని మ్యాచ్. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. 


టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఛేజింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శర్మ నిర్ణయం సరైందేనని ప్రారంభంలోనే తెలిసింది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేదు. 16 ఓవర్లలో 97 పరుగులకే ఆలవుట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభమైన రెండో బంతికే చెన్నై సూపర్‌కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కాన్వే ఈసారి విఫలమయ్యాడు. ఆ తరువాత రెండవ పరుగుకే మరో వికెట్ మొయిన్ అలీ అవుటయ్యాడు. మరి కాస్సేపటికి అంటే జట్టు స్కోరు 5 పరుగులున్నప్పుడు మూడవ వికెన్ నష్టపోయింది. 18 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ 4వ వికెట్‌గా వెనుదిరిగాడు. అలా వికెట్ల పతనం కొనసాగింది. స్కోరు 80 పరుగులు చేరేసరికి 9 వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లు విజృంభించడంతో 97 పరుగులకే చెన్నై ఇన్నింగ్స్ కుప్పకూలింది. 


ఆ తరువాత 98 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా కష్టాలెదురయ్యాయి. మొదటి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5వ ఓవర్ ముగిసేసరికి ముంబై ఇండియన్స్ కేవలం 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత హృతిక్, తిలక్ వర్మలు కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. 81 పరుగుల వద్ద 13వ ఓవర్‌లో 5వ వికెట్ పడింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో హృతిక్ అవుటయ్యాడు. 15వ ఓవర్ చివర్లో భారీ సిక్సర్‌తో ముంబై ఇండియన్స్ విజయం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పరాజయంతో చెన్నై సూపర్‌కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు నీరుగారిపోయాయి. 


Also read: Abu Dhabi Knight Riders: విదేశీ ఫ్రాంచైజీల కొనుగోలులో షారుక్ ఖాన్, అబుదాబి నైట్‌రైడర్స్.. కేకేఆర్ హస్తగతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook