Fans electrifying welcomes to CSK Captain MS Dhoni in Surat for IPL 2022: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించి అభిమానుల గుండెల్లో నిలిచారు. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్ ట్రోఫీ అందించి భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అందుకే ధోనీకి ఎంతో ఫాన్స్ బేస్ ఉంది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహీకి ఫాన్స్ ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా అతడిని కలిసేందుకు ఎంతో మంది ఫాన్స్ ప్రయత్నించారు. ఈ క్రమంలో భారికేడ్లు దాటి మైదానంలోకి వెళ్లి మహీ పాదాలను తాకిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఈ ఘటనలను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో. మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అతడి ప్రభావం మాత్రం తగ్గలేదు. మహీ ఎక్కడ ఉన్నా.. ఫాన్స్ అతడిని చూసేందుకు ఎగబడతారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో జరిగింది. 


కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 2022 లీగ్ దశమి కేవలం మహారాష్టకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని ఫ్రాంఛైజీలు ముంబై, పూణే సమీపంలోనే ప్రాక్టీస్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ సూరత్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతో సహా పలువురు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ కోసం ప్లేయర్స్ అందరూ రోజూ హోటల్‌ నుంచి మైదానానికి.. మైదానం నుంచి హోటల్‌కు వెళుతున్నారు. 



ఈ విషయం తెలుసుకున్న ఎంఎస్ ధోనీ అభిమానులు ఆయనను చూసేందుకు ఎదురుచూశారు. చెన్నై సూపర్ కింగ్స్ బస్సు వెళ్లే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని వేచిచూశారు. బస్సులో మహీ కనిపించగా.. ఫాన్స్ చేతులు ఊపుతూ సందడి చేశారు. మహీ, మహీ అంటూ పెద్దగా కేకలు వేశారు. అందుకు సంబంధించిన వీడియోను చెన్నై అభిమానులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కెమెంట్ల వర్షం కురుస్తోంది. 'మహీనా మజాకా', 'సూరత్‌లోనూ తగ్గేదేలే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మార్చి 26 ఐపీఎల్ 2022 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 


Also Read: Telangana CM KCR: సీఎం కేసీఆర్‌కు వైద్య ప‌రీక్ష‌లు.. వ్యక్తిగత డాక్టర్ ఏం చెప్పారంటే?!!


Also Read: Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook