Shikhar Dhawan becomes 1st Indian to hit 1000 boundaries in T20 Format: పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ ఓపెనర్‌, టీమిండియా వెటరన్ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా గబ్బర్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్‌ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్‌ ఈ ఘనత అందుకున్నాడు. లూకి ఫెర్గుసన్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించడంతో టీ20 ఫార్మాట్‌లో గబ్బర్ ఖాతాలో 1000వ ఫోర్ చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శిఖర్‌ ధావన్‌ 307 టీ20 మ్యాచులు ఆడి 1000 ఫోర్లు బాదాడు. ఈ రికార్డు ఐపీఎల్ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా సాధ్యం కాలేదు. గబ్బర్ తర్వాత 917 ఫోర్లతో కోహ్లీ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. 875 ఫోర్లతో రోహిత్ మూడో స్థానంలో ఉండగా.. 779 ఫోర్లతో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. గబ్బర్ రికార్డు అందుకోవాలంటే.. రోహిత్, కోహ్లీలకు సమయం పట్టే అవకాశం ఉంది.


అయితే టీ20 ఫార్మాట్‌లో 1000 ఫోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో శిఖర్ ధావన్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌లో గేల్ 1132 ఫోర్లు బాదాడు. ఈ జాబితాలో అలెక్స్ హేల్స్ (1054), డేవిడ్ వార్నర్ (1005), ఆరోన్ ఫించ్ (1004), శిఖర్ ధావన్‌ (1000) వరుసగా టాప్-5లో ఉన్నారు. టీ20 క్రికెట్‌లో గబ్బర్ 8850కి పైగా పరుగులు చేశాడు. 36 ఏళ్ల అతను 2011లో టీమిండియా తరఫున అరంగేట్రం చేయడానికి ముందు 2007లో పొట్టి ఫార్మాట్‌లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు.


శిఖర్ ధావన్‌ భారత్ తరఫున 34 టెస్టులు, 149 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. 68 టీ20ల్లో 1759 రన్స్ చేశాడు. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గబ్బర్ పరిమిత ఓవర్లలో మాత్రమే ఆడుతున్నాడు. ఇక 195 ఐపీఎల్ మ్యాచులలో ధావన్‌ 5876 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీలో గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడాడు. ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు ఆడుతున్నాడు. 


Also Read: CSK vs SRH Dream11 Prediction: హైదరాబాద్‌, చెన్నైలో కీలక మార్పులు.. ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్స్ ఇవే!


Also Read: AP Rains Forecast: ఏపీ ప్రజలకు కూల్‌న్యూస్, మూడ్రోజులపాటు వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook