CSK vs SRH Dream11 Prediction: హైదరాబాద్‌, చెన్నైలో కీలక మార్పులు.. ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్స్ ఇవే!

IPL 2022, CSK vs SRH Playing 11. ఐపీఎల్‌ 2022లో ఈరోజు రెండు మ్యాచ్‌ లు జరగనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 01:25 PM IST
  • హైదరాబాద్‌, చెన్నైలో కీలక మార్పులు
  • హైదరాబాద్‌ vs చెన్నైప్లేయింగ్ 11
  • హైదరాబాద్‌ vs చెన్నై డ్రీమ్ 11 టీమ్
CSK vs SRH Dream11 Prediction: హైదరాబాద్‌, చెన్నైలో కీలక మార్పులు.. ప్లేయింగ్ 11, డ్రీమ్ 11 టీమ్స్ ఇవే!

IPL 2022, CSK vs SRH 17th Match Dream11 Prediction: ఐపీఎల్‌ 2022లో ఈరోజు రెండు మ్యాచ్‌ లు జరగనున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ చెన్నై ఓటమిపాలైంది. అటు హైదరాబాద్‌ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ ల్లోనూ పరాజయం పొందింది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి గెలుపు బోణీ కొట్టాలని రెండు జట్లు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

రవీంద్ర జడేజా సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా రానున్నారు. ఉతప్ప వేగంగా ఆడుతున్నా.. రుతురాజ్ గాడిన పడాల్సిన అవసరం ఉంది. మూడో స్థానంలో మొయిన్ అలీ జట్టుకు పెద్ద బలం. మిడిల్ ఆర్డర్‌లో అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ రాణిస్తున్నా.. రవీంద్ర జడేజా ఫామ్ అందుకోవాల్సి ఉంది.  బౌలింగ్ విషయానికొస్తే.. దీపక్‌ చహర్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్ భారీగా పరుగులు ఇచ్చుకోవడం జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోంది. తుషార్ స్థానంలో ఈరోజూ రాజ్ హంగర్గేకర్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

హైదరాబాద్‌ జట్టు ఈ మ్యాచులో రాహుల్‌ త్రిపాఠిని అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌కు పంపించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్ బ్యాటింగ్‌కు రానున్నారు. పూరన్ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రొమారియో, మార్క్రామ్ కూడా పరుగులు చేస్తే హైదరాబాద్ భారీ స్కోర్ చేయగలదు. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ సహా వాషింగ్టన్ సుందర్ కూడా తడబడుతున్నారు. ఇప్పటికైనా వీరు గాడిన పడాల్సిన అవసరం ఎంతో ఉంది. 

తుది జట్లు (అంచనా):
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్. 
చెన్నై సూపర్‌ కింగ్స్‌: రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ, మహేష్ తీక్షణ, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, రాజ్ హంగర్గేకర్. 

డ్రీమ్ 11 టీమ్:
నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, రాబిన్ ఉతప్ప, వాషింగ్టన్ సుందర్ (వైస్ కెప్టెన్), మొయిన్ అలీ, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, క్రిస్ జోర్డాన్. 

Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్.. పవర్ ఫుల్ పాత్రలో..

Also Read: LPG, Petrol Prices Today: వామ్మో.. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో ప్రపంచ దేశాల్లో మనమే టాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News