IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలకమైన భేటీ ఇవాళ జరగనుంది. ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ప్రక్రియకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 కీలకమైన మెగా వేలం ప్రక్రియ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఆటగాళ్లు ఎంత ధర పలకనున్నారనేది తేలనుంది. దీనికి సంబంధించిన కీలకమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ( Ipl Governing Council Meeting) ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2022కు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ సారధ్యంలో జరగనున్న ఈ సమావేశంలో మెగా ఆక్షన్ ఎప్పుడు నిర్వహించేది, ఐపీఎల్ 2022 (IPL 2022)వేదిక, షెడ్యూల్‌పై కూడా చర్చ జరగనుంది. ప్రస్తుతం తమ దృష్టి ఐపీఎల్ వేలం విజయవంతంగా నిర్వహించడంపై ఉందని..మిగిలిన వివరాల్ని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ ద్వారా ముందుకు వెళ్లే మార్గాల్ని పరిశీలిస్తామని చెప్పారు. 


దేశంలో నెలకొన్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను విదేశాల్లోనే నిర్వహించాలనేది బీసీసీఐ (BCCI)నిర్ణయంగా ఉంది. అందుకే ఇవాళ జరగనున్న గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరపాలని తొలుత నిర్ణయించినా..కరోనా సంక్రమణ దృష్ట్యా వేదిక మార్చనున్నారు. 


Also read: IPL 2022: ఐపీఎల్ 2022లో రషీద్ ఖాన్‌ను ఏ సొంతం చేసుకునే జట్టేది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook