IPL 2022: ఐపీఎల్ 2022లో రషీద్ ఖాన్‌ను ఏ సొంతం చేసుకునే జట్టేది

IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ జట్ల ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్నాయి. ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి మరో జట్టుకు ఆడనున్నాడు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 11, 2022, 11:45 AM IST
 IPL 2022: ఐపీఎల్ 2022లో రషీద్ ఖాన్‌ను ఏ సొంతం చేసుకునే జట్టేది

IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ జట్ల ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్నాయి. ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి మరో జట్టుకు ఆడనున్నాడు.

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కొద్దిరోజుల్లో జరగనుంది. ఈసారి ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2022లో జట్ల ఆటగాళ్లలో పెనుమార్పులు రానున్నాయి. కెప్టెన్లు కూడా మారుతున్నారు. ఇప్పటికే వివిధ జట్ల రిటైన్ ప్లేయర్స్ లిస్ట్‌తో ఆ విషయం స్పష్టమైంది. ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలుగా అడుగుపెడుతున్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు వేలం కంటే ముందే ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని బీసీసీఐ (BCCI) కల్పించింది. ఈ నేపధ్యంలో ఎంపిక చేసుకునే ఆటగాళ్ల జాబితాను జనవరి 31 లోగా సమర్పించాల్సి ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లను వేలం ద్వారా తీసుకోవల్సి వస్తుంది. 

లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని నియమించనున్నట్టు తెలుస్తోంది. అటు ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో (Rashid Khan) కూడా లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. మరో కొత్త ఫ్రాంచైజీ అహ్మాదాబాద్ కూడా రషీద్ ఖాన్‌తో చర్చలు జరుపుతోంది. ఒకవేళ లక్నో ఫ్రాంచైజీ-రషీద్ ఖాన్ మద్య చర్చలు విఫలమైతే..మార్కస్ స్టోయినిస్, రబడాలను ఎంచుకునే అవకాశాలున్నాయి. ఇక అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి.

Also read: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, పూర్తయిన సంప్రదింపులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News