Dhoni Warns to CSK Bowlers: ఐపీఎల్ 2023 సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్‌జి మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అత్యంత మనోరంజకంగా మారిందని చెప్పవచ్చు. ఇరు జట్ల నుంచి భారీగా పరుగుల వరద కన్పించింది. సిక్సర్ల, ఫోర్లతో స్డేడియం దద్దరిల్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2023 సీఎస్కే వర్సెస్ ఎల్‌ఎస్‌జి మ్యాచ్‌లో విజయం అనంతరం సీఎస్కే సారధి ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ ధోనీకు ఒక ల్యాండ్ మార్క్. ఈ మ్యాచ్‌లో ధోని చేసిన 12 పరుగులతో అతను 5000 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ నెగ్గినా సీఎస్కే బౌలర్ల పేలవమైన ప్రదర్శన ధోనీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొయిన్ అలీ తప్ప మరెవరూ రాణించలేదు సరి కదా..- ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అదే సమయంలో వైడ్స్, నో బాల్స్ అధికమయ్యాయి. నిన్నటి మ్యాచ్‌లో 13 వైడ్స్, 3 నో బాల్స్ చోటుచేసుకోవడం విశేషం.


నో బాల్స్ అస్సలు వేయకూడదు. వైడ్ బాల్స్ తక్కువగా ఉండాలి, కానీ మావాళ్ల నుంచి ఎక్స్టా బాల్స్ చాలా వేశారు. ఇది తగ్గించాల్సిన అవసరముంది. లేకుంటే మరో కెప్టెన్ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుందని మ్యాచ్ అనంతరం ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు.


చేపాక్ స్డేడియంలో భారీగా పరుగుల వరద రావడంపై ధోనీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ చాలా అద్భుతమైంది, హై స్కోరింగ్ గేమ్ ఇది. పిచ్ వికెట్ ఎలా ఉంటుందో అని సందేహముండేది.  గత 5-6 ఏళ్లలో ఇక్కడ ఇదే అద్భుతమైన గేమ్. స్లోగా ఉంటుందనుకున్నాను. పరుగులు ఎక్కువగా వచ్చని ప్రతిసారి వికెట్ లభించేది. ఇక తదుపరి ఆరు గేమ్స్ ఈ పిచ్‌పై ఎలా ఉంటాయో చూడాలంటూ ధోనీ వ్యాఖ్యానించాడు.


సీఎస్కే పేస్ బౌలింగ్ విభాగం ఇంకా కొద్దిగా మెరుగుపడాల్సిన అవసరముందని, పరిస్థితుల్ని బట్టి బౌల్ చేయాలని ధోని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఫ్లాటర్ సైడ్‌లో కూడా బ్యాటర్లు హిట్ చేస్తున్నారన్నారు. బౌలర్లు మెరుగుపర్చుకోకపోతే మరో కెప్టెన్ నేతృత్వంలో ఆడాల్సి ఉంటుందని స్పష్టంగా హెచ్చరించాడు. 


ఇక తాము టాస్ గెలిచి సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించాక సరైన ప్రారంభం చేయలేకపోయామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. పిచ్‌లో ఏదో స్టిక్కీగా ఉందని..అది సమస్యగా మారిందని బౌలర్లు చెప్పారన్నారు. ప్రత్యర్ధి జట్టులో క్వాలిటీ బ్యాటర్లు ఉంటే మూల్యం చెల్లించుకోవల్సిందేనని ఒప్పుకున్నాడు. ఫ్రెష్ వికెట్‌పై తొలుత బౌలింగ్ చేసినప్పుడు ఏది మంచి పేస్, ఎలా బౌల్ చేయాలనేది తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతుందన్నాడు రాహుల్. కాన్వే, రుతురాజ్ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.  


Also Read: CSK vs LSG IPL 2023 match: హైయెస్ట్ పవర్ ప్లేలో చెన్నై రికార్డు.. లక్నోపై ధోనీ సేన గెలుపు


Also Read: Happy Hanuman Jayanti 2023: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీ స్నేహితులకు పంపారా? అయితే ఇలా పంపండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook