Happy Hanuman Jayanti 2023 Status: హనుమంతుడు చైత్ర మాసం పౌర్ణమి రోజున జన్మించడం వల్ల ప్రతి సంవత్సరం ఈ రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమంతుడు ఈ రోజునే సూర్యోదయం సమయంలో జన్మించాడు. అందుకే హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి దేవాలయంలో సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ప్రారంభమవుతాయి. అయితే ఈ రోజు భక్తులంతా స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసాలు పాటిస్తారు. ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల జీవితంలో కలిగే దుష్ప్రభావాలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే హనుమాన్ జయంతి రోజున ఆ స్వామి అనుగ్రహం మీకు మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు కలగాలను ఆశిస్తూ.. హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శుభకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలపండి.
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు:
హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటూ మీకు, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు..హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శుభాకాంక్షలు.
హనుమంతుడు చేసి ధైర్యసాహసాలు, మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలపై చేసి విజయం పొందాలని ఆశిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
జీవితంలో చేసే ప్రతి పనికి ముందు హనుమంతుడి దైర్యం పొంది అన్ని పనుల్లో విజయం సాధించి, ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శుభాకాంక్షలు.
రామ నామాన్ని తలుచుకి శత్రువులపై విజయం సాధించాలని కోరుకుంటు.. మీకు, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
హనుమంతుడు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆనందంతో నింపాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శుభాకాంక్షలు.
హనుమాన్ జయంతి ప్రత్యేక కోట్స్:
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది.
"రామతత్వం"
కష్టంలో కలసి నడవాలన్నది.
కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది
నమ్మినవారి కోసం తెగించమంటుంది.
"ఆంజనేయ తత్వం"
హనుమాన్ జయంతి (Hanuman Jayanti) శుభాకాంక్షలు.
'హనుమ బలం.. అసమానమైన భక్తి నిస్వార్థ సేవకు ప్రతీక అయిన ఆంజనేయుడు మీకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఎక్కడ రామ నామం స్మరిస్తారో..ఎక్కడ హనుమంతుడికి చేతులు జోడించి నమస్కరిస్తారో..
అక్కడ అంతా రామ రాజ్యమే!
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Also Read: Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook