Lucknow Super Giants vs Sunrisers Hyderabad Dream11 Team Prediction for Todays match: ఐపీఎల్ 2023లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మెగా టోర్నీలో లక్నో మూడో మ్యాచ్ ఆడుతుండగా.. సన్‌రైజర్స్‌ రెండో గేమ్ ఆడనుంది. ఈ రెండు జట్లు (LSG vs SRH) తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోయాయి. దాంతో ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు చూస్తున్నాయి. లక్నో మెగా టోర్నీలో శుభారంభం చేయగా.. సన్‌రైజర్స్ ఇంకా ఖాతా తెరవలేదు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు లక్నో, హైదరాబాద్ (LKN vs SRH) మ్యాచ్ ఆరంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచుకు అందుబాటులోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో డికాక్ ఆడనున్నాడు. డికాక్ ఆడితే మార్కస్ స్టొయినిస్‌ బెంచ్‌కే పరిమితం కానునున్నాడు. ఎందుకంటే కైలే మేయర్స్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు బాది సత్తాచాటాడు. నికొలస్ పూరన్, మార్క్ వుడ్ కూడా ఆడనున్నారు. దాంతో విదేశీ కోటా పూర్తవుతుంది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్నప్పటికీ ప్లేయర్ల నిలకడలేమి లక్నోను వేధిస్తోంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. దాంతో ఈ మ్యాచుకు అతడు సారథ్యం చేపట్టనున్నాడు. మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ వర్మ, అబ్దుల్ సమద్ బ్యాటింగ్ విభాగంలో కీలకం కానున్నారు. బౌలర్లలో టీ నటరాజన్, ఫజల్ హక్ ఫారూఖీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్ సత్తాచాటితే సన్‌రైజర్స్ జట్టుకి తిరుగుండదు. 


డ్రీమ్11 టీమ్ (LKN vs SRH Dream 11 Team):
క్వింటన్ డికాక్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి (వైస్ కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్.


Also Read: Surya Grahan 2023: ఈ నెలలోనే సూర్య గ్రహణం 2023.. ఈ రాశుల జాగ్రత్తగా ఉండాలి! లేదంటే కథ కంచికే  


Also Read: Vodafone Idea Recharge Plans 2023: వోడాఫోన్ ఐడియా సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్‌, జియోలకు ఇక చుక్కలే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.