Dhoni Takes Class to Tushar: తుషార్ దేశ్‌పాండేకు ధోనీ సీరియస్ క్లాస్.. వీడియో వైరల్
MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు.
Dhoni Takes Class to Tushar Deshpande against Lucknow Super Giants Match: లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినప్పటికీ.. ఆ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం జట్టు బౌలర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అప్పటికే ఐపిఎల్ 2023 ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయంపాలైన అవమానంతో ఉన్న ధోనీకి రెండో మ్యాచ్‌లోనైనా ఎలాగైనా గెలిచి పాయింట్స్ పట్టికలో తమ స్థాయి మరింత దిగజారకుండా చూసుకోవాలనే కసి మీదున్న ధోనీకి చెన్నై బౌలర్ల చెత్త ప్రదర్శన విపరీతమైన కోపం తెప్పించింది. మరీ ముఖ్యంగా సీరియల్ నో బాల్స్ వేసిన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండేకు ధోనీ చేతిలో సీరియస్ క్లాస్ తప్పలేదు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఆ మ్యాచ్‌లో వైడ్స్, నో బాల్స్ రూపంలో భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఈ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ 218 పరుగుల భారీ స్కోర్ చేసి ప్రత్యర్థులకు భారీ స్కోర్ లక్ష్యంగా విధించినప్పటికీ.. చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా 12 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ గట్టిగా రెండు సిక్సులు కొడితే సాధించే స్కోర్ ఇది. అంటే ఈ మ్యాచులో ప్రత్యర్థి జట్టు లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లలో ఎవరైనా ఇంకో మూడు ఫోర్లు ఎక్కువ కొట్టినా లేదా రెండు సిక్సులు ఎక్కువ కొట్టినా విజయం చేతులు మారేదే. సరిగ్గా ఇదే అంశం ధోనీకి బాగా కోపం తెప్పించిందట.
తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు. బంతిని ఎలా డెలివరీ చేస్తే నో బాల్స్ పడవో చెబుతూ అతడికి మోషన్ పోస్టర్‌తో చూపించి వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి : MS Dhoni Seat: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
ఏప్రిల్ 8న జరగనున్న 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి తమ పరిస్థితిని మరింత మెరుగుపర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ హార్డ్ వర్క్ చేస్తోంది. అందులో భాగంగానే ధోనీ కూడా తమ జట్టు ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి తను కెప్టేన్‌గా ఉన్న జట్టు ఆటగాళ్లలో స్పూర్తిని నింపడమే తప్ప కోపగించుకోవడం తెలియని ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీకి పేరుంది. అందుకే ధోనీ మిస్టర్ కూల్ కెప్టేన్ అయ్యాడు.
ఇది కూడా చదవండి : Kaviya Maran To Isha Negi: ఐపిఎల్‌లో హైలైట్ అయిన గాళ్స్.. ఐపిఎల్ 2023 లోనూ సందడి చేసేనా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook