Rajasthan Royals vs Punjab Kings Playing 11 Out: ఐపీఎల్ 2023లో భాగంగా గువాహటిలోని బర్సాపుర స్టేడియంలో మరికొద్దిసేపట్లో రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్‌కు గువాహటి మైదానం రెండో హోం గ్రౌండ్‌ కావడం విశేషం. రాజస్థాన్‌, పంజాబ్‌ ఐపీఎల్ 16వ సీజన్‌ను విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎట్టకేలకు అస్సాంలోని గువాహటి బర్సాపుర క్రికెట్‌ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్‌ జరగనుంది. దాంతో దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం 2018లో గువాహటి స్టేడియాన్ని అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ బీసీసీఐకి సిఫార్సు చేసింది. రెండేళ్ల తర్వాత 2020లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్ కారణంగా టోర్నీ యూఏఈకి తరలిపోయింది. ఆపై రెండేళ్లు కూడా హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరగలేదు. ఇప్పుడు ప్రేక్షకుల మధ్య మ్యాచులు జరుగుతున్నాయి. రాజస్థాన్‌ తన రెండో హోం గ్రౌండ్‌గా గువాహటిని ఎంపిక చేసుకుంది. 



తుది జట్లు:
పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్‌ ఖాన్, సామ్ కరన్, సికిందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్. 
రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్‌ కీపర్), దేవదుత్ పడిక్కల్‌, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం అసిఫ్, యుజ్వేంద్ర చహల్. 


Also Read: Hanuman Jayanti 2023: ఈసారి హనుమాన్ జయంతి అత్యంత పవిత్రమైనది.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!  


Also Read: Remote Ceiling Fan: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.