RR Opener Yashasvi Jaiswal 94 meter Six Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2023లో రాజస్తాన్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ హవా కొనసాగుతోంది. మొన్నటివరకు హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి.. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. వాంఖడేలో ఫోర్లు, సిక్సులు బాదుతూ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు.జైస్వాల్‌ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్‌ ఏకంగా 94 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. ఆ బంతి ఏకంగా ముంబైలోని వాంఖడే స్టేడియం బయట పడింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్తాన్‌ రాయల్స్ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ను ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా అర్చర్‌ వేశాడు. ఆ ఓవర్లోని చివరి బంతిని యశస్వి జైస్వాల్‌  సిక్స్‌గా మలిచాడు. కాస్త లెగ్ సైడ్ వచ్చిన బంతిని అదే దిశగా యశస్వి బలంగా బాదాడు. రాజస్థాన్ ఓపెనర్ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం బయటకు వెళ్లి పడింది. దాంతో అర్చర్‌ సహా ముంబై ప్లేయర్స్ అందరూ షాక్ అయ్యారు. రాజస్థాన్ ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ 'యశస్వి జైస్వాల్‌'సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఐపీఎల్‌ కెరీర్‌లో యశస్వి జైశ్వాల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. పరుగుల వరద పారిస్తున్న జైశ్వాల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న జైశ్వాల్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం యశస్వి ఆటకు ఫిదా అయ్యాడు. యశస్వి అద్భుతంగా ఆడుతున్నాడని, అతడి ప్రదర్శనను గతే సీజన్‌లోనే చూశానన్నాడు. యశస్వి ఈ తరహా క్రికెట్‌ ఆడుతుండడం రాజస్తాన్‌, భారత క్రికెట్‌కు చాలా మంచిదని రోహిత్ పేర్కొన్నాడు. ఆరెంజ్ క్యాప్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి 428 పరుగులు చేశాడు. 



చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్ ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో మూడు బంతులు ఉండగానే.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. టిమ్‌ డేవిడ్‌  (45 నాటౌట్‌; 14 బంతుల్లో 2×4, 5×6) వరుసగా మూడు సిక్స్‌లు బాది ముంబైకి ఊహించని విజయాన్ని అందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (55; 29 బంతుల్లో 8×4, 2×6) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్‌ (124; 62 బంతుల్లో 16×4, 8×6) సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్‌ కావడం విశేషం.


Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!  


Also Read: IPL 2023 Points Table: రాజస్థాన్‌పై ముంబై విజయం.. పాయింట్ల పట్టికలో కీలక మార్పులు! టాప్‌లో గుజరాత్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.