Umpire given not out batter because bowler HandTowel fell: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడు కొన్ని అరుదైన, ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అంపైర్‌ తప్పిదం కారణంగా బ్యాటర్ బతికిపోతాడు. ఒక్కోసారి నోబాల్‌కు బ్యాటర్ క్యాచ్‌ ఔట్ అయితే.. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో బచాయిస్తాడు. ఇది సర్వసాధారణం.. మనం తరచుగా మ్యాచులలో చూస్తూనే ఉంటాం. అయితే బౌలర్ హ్యాండ్ కర్చీఫ్ కిందపడడంతో బ్యాటర్‌ బతికిపోయిన ఘటనను ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా?. వినడానికి ఇది కొత్తగా ఉంది కదా.. ఈ ఘటన న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. కివీస్‌ సీమర్‌ బ్లెయిర్‌ టిక్నర్‌ 43వ ఓవర్ ఐదవ బంతిని గుడ్‌లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్‌ అవతల విసిరాడు. క్రీజులో ఉన్న ఐరిష్ బ్యాటర్ సిమీ సింగ్‌ (11) థర్డ్‌మన్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ అంచును తాకుతూ వెళ్లి కీపర్‌ టాప్‌ లాథమ్‌ చేతిలో పడింది. దాంతో ఫీల్డ్‌ అంపైర్‌ పాల్‌ రెనాల్డ్స్‌ ఔట్‌ అని ప్రకటించాడు. కివీస్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. అయితే లెగ్ అంపైర్‌ అలీందార్‌.. ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి సిమీని నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్‌ నిర్ణయంతో కివీస్‌ ఆటగాళ్లు షాక్‌ తిన్నారు.


టామ్‌ లాథమ్‌ ఎందుకు ఔట్‌ కాదంటూ ఫీల్డ్ అంపైర్‌ వద్దకు వచ్చి ప్రశ్నించాడు. బ్లెయిర్‌ టిక్నర్‌ బంతి వదలడానికి ముందు అతని హ్యాండ్ కర్చీఫ్ పిచ్‌పై పడిందని, ఇది నిబంధనలకు విరుద్దమని తెలిపాడు. ఈ చర్య వల్ల బ్యాటర్ ఏకాగ్రత దెబ్బతిని ఔటయ్యే ప్రమాదం ఉందని, అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డెడ్‌ బాల్‌గా ప్రకటించినట్లు తెలిపాడు.  కర్చీఫ్ వల్ల బ్యాటర్‌ ఏకాగ్రతకు ఎలాంటి భంగం కలగలేదని లాథమ్‌ చేపినప్పటికీ.. అంపైర్‌ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. దాంతో లాథమ్‌ నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 



క్రికెట్‌ నిబంధనల 20.4.2.7 క్లాజ్‌ ప్రకారం.. ఎవరైనా బౌలర్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు బ్యాటర్ దృష్టి మరల్చే వీలున్న పరిస్థితులు ఏర్పడితే అంపైర్‌ ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఆ నిబంధనల ప్రకారమే సిమి సింగ్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు అలీందార్‌. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్‌కు చెప్పడంతో అతడు డెడ్‌ బాల్‌గా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చుసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  


Also Read: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?


Also Read: Vaani Kapoor Pics: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో.. అందాల ట్రీట్ ఇచ్చిన వాణీ క‌పూర్!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.