Is Ravindra Jadeja leves Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించిన జడేజా చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆలాంటి జడేజా చెన్నైకి గుడ్‌బై చెప్పనున్నాడా?.. వచ్చే ఏడాది సీఎస్‌కేని వీడనున్నాడా? అంటే అవుననే సమాధానం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి సీఎస్‌కేకు సంబంధించిన అన్ని పోస్టులను డిలీట్‌ చేయడమే ఇందుకు కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి ఎంఎస్ ధోనీ తప్పుకొగా.. రవీంద్ర జడేజా జట్టు పగ్గాలు అందుకున్నాడు. జడేజా సారథ్యంలో ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింటిలో మాత్రమే చెన్నై విజయం సాధించింది. మరోవైపు ఆటగాడిగానూ జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో స్వయంగా చెన్నై పగ్గాలను జడ్డూ వదిలేయడంతో.. ధోనీకే మళ్లీ అప్పగిస్తూ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 


కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే రవీంద్ర జడేజా పక్కటెముక గాయం కారణంగా ఐపీఎల్ 2022 మొత్తానికి దూరమయ్యాడు. 15వ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టుతో జడేజాకు విభేదాలు తలెత్తినట్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి చెన్నై జట్టుకు సంబంధించిన అన్ని పోస్టులను తొలగించడంతో సీఎస్‌కేని వదలనున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జడేజా పోస్టులు డిలేట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జడ్డు బెంగళూరులో చేరనున్నాడని సమాచారం తెలుస్తోంది. 


గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా.. ఇటీవలే భారత జట్టులో చేరాడు. జులై 1 నుంచి 5 వరకు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. మొదటి టీ20 మ్యాచుకు దూరమయిన జడేజా.. నేడు జరిగే రెండో మ్యాచులో ఆడనున్నాడు. జడేజా భారత్ తరఫున 60 టెస్టులు, 168 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇక 210 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. 


Also Read: Flipkart iPhone 13: ఇంతకుమించిన ఆఫర్ ఉండదు.. ఐఫోన్ 13పై రూ.21 వేలు తగ్గింపు.. రేపే ఆఫర్ ముగింపు  


Also Read: Nephrotic Syndrome: మీ పిల్లలు తరచుగా అలసిపోతున్నారా..?  అయితే ఈ సమస్యల కారణంగానే..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook