Flipkart iPhone 13: ఇంతకుమించిన ఆఫర్ ఉండదు.. ఐఫోన్ 13పై రూ.21 వేలు తగ్గింపు.. రేపే ఆఫర్ ముగింపు

Flipkart iPhone 13:  ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా రూ.79 వేలు విలువ చేసే ఐఫోన్ 13ని ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ.58,499కే సొంతం చేసుకోవచ్చు. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 9, 2022, 10:52 AM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్
  • ఐఫోన్ 13పై రూ.21 వేలు తగ్గింపు
  • ఆఫర్ రేపటితో ముగింపు
Flipkart iPhone 13: ఇంతకుమించిన ఆఫర్ ఉండదు.. ఐఫోన్ 13పై రూ.21 వేలు తగ్గింపు.. రేపే ఆఫర్ ముగింపు

Flipkart iPhone 13: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే మీ ఫేవరెట్ బ్రాండ్స్‌ను చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు.  యాపిల్ ఐఫోన్లపై సైతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ డిస్కౌంట్‌‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తోంది. రూ.79 వేలు విలువ చేసే ఐఫోన్ 13ని ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ.58,499కే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

ఐఫోన్ 13పై 7 శాతం డిస్కౌంట్ :

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 (పింక్, 128 జీబీ)పై 7 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో రూ.79,900 విలువ చేసే ఈ ఐఫోన్‌పై రూ.5901 వరకు ఆదా అవుతుంది. తద్వారా రూ.73,999కే మీరు ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1 వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మరింత చౌకగా రూ.72,999కే ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.14,500 తగ్గింపు :

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 (పింక్, 128 జీబీ)పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్ఠంగా రూ.14,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ద్వారా మీకు లభించే తగ్గింపు పూర్తిగా మీ ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే మీ పంట పండినట్లే. రూ.73,999కి అందుబాటులో ఉన్న ఈ ఐఫోన్‌ని రూ.59,499కే పొందవచ్చు. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలా ఈ ఐఫోన్‌ని కేవలం రూ.58,499కే మీ సొంతంచేసుకోవచ్చు. అంటే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కలిపి మొత్తం రూ.20,401 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 6 నుంచి జూలై 10 వరకు మాత్రమే ఎలక్ట్రానిక్ సేల్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఆలోపే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 

Also Read: BANDI SANJAY:త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. రేసులో బండి సంజయ్, సోయం బాపురావు?  

Also Read: Covid Cases Update:దేశంలో కొవిడ్ కల్లోలం.. భారీగా పెరిగిన మరణాలు.. ప్రమాదకరంగా పాజిటివిటి రేట్

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News