Jasprit Bumrah Record: టెస్టుల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బుమ్రా.. బ్రియాన్ లారా రికార్డు బద్దలు!
IND vs ENG: Jasprit Bumrah Breaks Brian Lara Batting Record In Test Cricket. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచాడు.
Jasprit Bumrah Breaks Brian Lara Batting Record In Test Cricket: ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు (జులై 1) ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (146; 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత సెంచరీ చేయగా.. రెండో రోజైన శనివారం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13 ఫోర్లు) సెంచరీ బాదాడు. వీరిద్దరి అనంతరం తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) చెలరేగాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్‌లో 84.5 ఓవర్లలో 416 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ 84 ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లీష్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. బ్రాడ్ వేసిన 84 ఓవర్లో ఏకంగా 35 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి బుమ్రా బౌండరీ బాధగా.. రెండో బంతి వైడ్ ప్లస్ ఫోర్ వెళ్లింది. నో బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి బౌండరీ బాదాడు. అంటే ఒక్క బంతికే ఏకంగా 15 రన్స్ వచ్చాయి. ఇక 3,4, బంతులను బుమ్రా బౌండరీకి తరలించగా.. ఐదవ బంతికి సిక్స్ బాదాడు. చివరి బంతికి సింగల్ వచ్చింది. మొత్తంగా ఈ ఓవర్లో 35 రన్స్ వచ్చాయి.
జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టి.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇంతకముందు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఒకే ఓవర్లలో 28 పరుగులు చేశాడు. 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్ పీటర్సన్ బౌలింగ్‌లో లారా ఈ పరుగులు చేశాడు. ఇప్పటి వరకు లారా రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. తాజాగా బుమ్రా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 2013 పెర్త్‌లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జార్జ్ బెయిలీ 28 రన్స్ చేయగా.. 2020లో పోర్ట్ ఎలిజిబెత్‌లో జో రూట్ బౌలింగ్‌లో కేశవ్ మహారాజ్ 28 పరుగులు చేశాడు.
ఇక టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నమోదు చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్ పీటర్సన్ ఒకే ఓవర్లో 28 పరుగులు ఇచ్చాడు. ఇప్పడు బ్రాడ్ 35 పరుగులు ఇచ్చి ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. దాంతో టెస్టు, టీ 20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో మాత్రం ఈ రికార్డు నెదర్లాండ్ బౌలర్ డీఎల్‌ఎస్ వాన్ బంజ్‌పై ఉంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ హర్షల్ గిబ్స్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడంతో ఒకే ఓవర్లో 36 పరుగులు ఇచ్చాడు.
Also Read: టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ తర్వాత..!
Also Read: క్రిస్ గేల్‌ను కలిసిన టాలీవుడ్ కమెడియన్.. ఎక్కడో తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook