Chris Gayle: అరుదైన రికార్డుకు చేరువలో క్రిస్ గేల్
కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ (Chris Gayle) అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 16 పరుగులు సాధిస్తే రెండో విదేశీ క్రికెటర్‌గా నిలవనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో కరీబియన్ ఆటగాడు, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ ఆటగాడు గేల్. మరో 16 పరుగులు సాధించాడంటే.. ఐపీఎల్‌లో 4500 పరుగుల మైలురాయిని వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ చేరుకుంటాడు. MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్‌లో ట్రోలింగ్
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్ గేల్ ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab)కు ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 125 మ్యాచ్‌లాడిన గేల్.. 4,484 పరుగులు సాధించాడు. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో మరో 16 పరుగులు సాధిస్తే 4,500 మార్కు చేరుకున్న రెండో విదేశీ క్రికెటర్‌గా క్రిస్ గేల్ నిలవనున్నాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (4,706) ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్
కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆ మార్క్ చేరుకున్న ఆరో బ్యాట్స్‌మన్‌గా కరీబియన్ వీరుడు అరుదైన జాబితాలో చోటు దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ (5,412), సురేశ్ రైనా (5,368) మాత్రమే 5 వేల మార్కు చేరుకున్నారు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ లో గేల్ 37 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడని పంజాబ్ జట్టు ట్వీట్ చేసింది. MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ
ఫొటో గ్యాలరీలు
Sushant Singh Rajput Wax Statue: సుశాంత్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. Photos
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR