KL Rahul: ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా! స్టొయినిస్‌కు వార్నింగ్
IPL 2022, LSG vs RCB: KL Rahul fined, Marcus Stoinis reprimanded. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా లక్నో సారథి కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది.
KL Rahul fined 20 per cent match fee for breaching IPL Code of Conduct: లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాత్రి ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా రాహుల్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. మరోవైపు ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ మందలింపునకు గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నిబంధనను కేఎల్ రాహుల్ అతిక్రమించాడని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఏ కారణంతో రాహుల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనేది మాత్రం ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు. మొత్తానికి రాహుల్‌పై జరిమానా పడింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడికి రావాల్సిన మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది.
ఇదివరకే లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్‌కు జరిమానా పడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా పడింది. తాజాగా మరోసారి అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఇప్పటికే ఓసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన కారణంగా.. మరో రెండు సార్లు రాహుల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోనున్నాడు.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ తృటిలో జరిమానా నుంచి తప్పించకున్నాడు. వైడ్ విషయంలో అంపైర్ నిర్ణయంను తప్పుబట్టిన స్టోయినిస్.. ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను అతిక్రమించాడు. అంతేకాదు ఔట్ అయిన అనంతరం అసభ్య పదజాలం ఉపయోగించాడు. దాంతో అతడిపై జరిమానా విధించకుండా వార్నింగ్‌తో సరిపెట్టారు ఐపీఎల్ నిర్వాహకులు. ఇది మరోసారి రిపీట్ కాకుండా ఉండాలని స్టోయినిస్‌ను హెచ్చరించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Also Read: Viral News: 10 రూపాయల నోటుపై ప్రేమ సందేశం.. ఫొటో వైరల్!
Also Read: Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook