LSG vs MI: రాహుల్ క్లాసిక్ సెంచరీ.. లక్నో ఘన విజయం! ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
KL Rahul 103 runs helps Lucknow beat Mumbai by 36 runs. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
KL Rahul hundred, Krunal Pandya 3 wickets helps Lucknow beat Mumbai by 36 runs: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. లక్నో నిర్ధేచించిన 169 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ (39; 31 బంతుల్లో 5x4, 1x6), తిలక్ వర్మ (38; 27 బంతుల్లో 2x4, 2x6) టాప్ స్కోరర్లు. కీరన్ పొలార్డ్ 20 బంతులు ఆడి కేవలం 19 రన్స్ మాత్రమే చేశాడు. లక్నో స్పిన్నర్ కృనాల్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు.
169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (8) మంచి ఆరంభమే అందించారు. ఇషాన్ నెమ్మదిగా ఆడినా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా ముమునై 43 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్‌లో రవి బిష్ణోయ్‌ను బౌలింగ్ లో ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డెవాల్డ్ బ్రెవిస్ (3), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (7) వెంటవెంటనే ఔటవ్వడంతో ముంబై 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో తిలక్ వర్మ,కీరన్ పొలార్డ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. భారీ సిక్సర్లతో ముంబై విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే ఒత్తిడికి గురైన తిలక్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. పొలార్డ్ తన ప్రభావం చూపలేదు. చివరి ఓవర్‌లో 39 పరుగులు అవసరమవ్వగా.. కృనాల్ మూడు వికెట్లు తీసి లక్నోకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. మిగిలిన 6 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (103 నాటౌట్; 62 బంతుల్లో 12x4, 4x6) మరోసారి సెంచరీతో చెలరేగాడు. రాహుల్ తర్వాత మనీష్ పాండే (22; 22 బంతుల్లో 1x6) టాప్ స్కోరర్. క్వింటన్ డీకాక్ (10), మార్కస్ స్టోయినిస్ (0), కృనాల్ పాండ్యా (1), దీపక్ హుడా (10), ఆయుష్ బదోనీ (14) స్పల్పస్కోర్లకే పరిమితం అయ్యారు. ముంబై బౌలర్లలో కీరన్ పొలార్డ్, రైలీ మెరెడిత్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. డానియల్ శామ్స్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.
Also Read: Rashmika Vijay: రష్మిక మందన్నకు విజయ్ దేవరకొండ ప్రపోజల్.. నేషనల్ క్రష్ ఒకే చెప్పేసిందా?
Also Read: Pooja Hegde Red Saree: రెడ్ సారీలో పూజా హెగ్దే.. దేశీ అవతార్ బలేగుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.