MS Dhoni: ధోనీకి కోవిడ్-19 టెస్టు.. రిపోర్టు ఏం చెబుతోంది అంటే...
ధోనీ ( MS Dhoni ) అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( Indian Preimer League ) కోసం సిద్ధం అవుతున్న మహేంద్ర సింగ్ ధోనికి ఇవాళ ఉదయం కోవిడ్-19 ( Covidi 19 ) పరిక్ష చేయించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) టీమ్ కు కెప్టెన్ అయిన ధోనీకి నేడు నిర్వహించిన టెస్టులో ఫలితాలు అప్పుడే వచ్చేశాయి.
ధోనీ ( MS Dhoni ) అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ( Indian Preimer League ) కోసం సిద్ధం అవుతున్న మహేంద్ర సింగ్ ధోనికి ఇవాళ ఉదయం కోవిడ్-19 ( Covidi 19 ) పరిక్ష చేయించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) టీమ్ కు కెప్టెన్ అయిన ధోనీకి నేడు నిర్వహించిన టెస్టులో ఫలితాలు అప్పుడే వచ్చేశాయి. అంతకు ముందు రాంచీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చెందిన వైద్యులు ధోనీ ఫామ్ హౌజ్ కు వచ్చి టెస్టు సాంపిల్స్ తీసుకెళ్లారు. సాయంత్రం ఫలితాలు వెల్లడించారు.
ఇందులో ధోనీకి నెగెటీవ్ అని వచ్చింది. దీంతో అభిమానులు ముఖ్యంగా చెన్నై టీమ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ టెస్ట్ ఫలితం ఆధారంగా చెన్నైలో ట్రైనింగ్ సెషన్ కు ధోనీ హాజరు అవ్వాల్సి ఉంది. అయితే నెగెటీవ్ రావడంతో శుక్రవారం చెన్నైకి వెళ్లనున్నాడు ధోనీ. ఏ ఏడాది ఐపిఎల్ మ్యాచులను యూఏఈలో (IPL In UAE ) నిర్వహించనున్నారు. ఇందు కోసం దుబాయ్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ నడుమ లీగ్ ను పక్కగా ప్లాన్ చేశారట. ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.