మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. టీమిండియా మాజీ కెప్టేన్, IPL 2020 లో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్లపాటు తమ జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు. ఐపిఎల్ 2020 తో పాటు ఐపిఎల్ 2021 ( IPL 2021 )లోనూ  మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతాడని ఆశించవచ్చని.. అలాగే ఐపిఎల్ 2022 ( IPL 2022)లో సైతం ధోనీ ఆడతాడని ఆశిస్తున్నట్టు కాశీ విశ్వనాథన్ ధీమా వ్యక్తంచేశారు. Also read : #Watch Suresh Raina: ధోనీ తర్వాత మళ్లీ తనే.. రోహిత్ శర్మపై రైనా ప్రశంసలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధోనీ రాంచీలోని స్టేడియంలో ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడని, అతడి ప్రాక్టీసింగ్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తూ మీడియాలో పలు కథనాలు చూస్తున్నాని చెప్పిన కాశీ విశ్వనాథన్.. ధోనీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. మహేంద్ర సింగ్ ధోనీకి తన బాధ్యతలు ఏంటి ? ఏం చేయాలనే విషయాలు అన్నీ తెలుసునని ధోనీ సామర్ధ్యాలపై ధీమా వ్యక్తంచేస్తూ కాశీ విశ్వనాధన్ ( CSK CEO Kasi Viswanathan )  ఈ వ్యాఖ్యలు చేశారు. Also read : IPL 2020: ఐపిఎల్ 2020లో అన్నీ సవాళ్లే: సురేష్ రైనా


Coronavirus వ్యాప్తి కారణంగా మార్చి నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఐపిఎల్ 2020 టోర్నమెంట్ సెప్టెంబర్ 19కి వాయిదా పడిన విషయం తెలిసిందే. యూఏఈలో జరగనున్న ఐపిఎల్ 2020 కోసం ఆటగాళ్లంతా యూఏఈకి ( IPL 2020 UAE schedule ) బయల్దేరి వెళ్లనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( Chennai Super Kings ) ఆటగాళ్లు ఆగస్టు 21న యూఏఈ ఫ్లైట్ ఎక్కనున్నట్టు తెలుస్తోంది. Also read : Shoaib Akhtar: బీసీసీఐపై విషం చిమ్మిన షోయబ్ అక్తర్